Sleeping Job: నిజంగా నిజం.. నిద్రపోవడమే ఉద్యోగం.. 5 రోజులకు రూ.14 లక్షలు..

Sleeping Job: నిజంగా నిజం.. నిద్రపోవడమే ఉద్యోగం.. 5 రోజులకు రూ.14 లక్షలు..
Sleeping Job: డబ్బులు ఊరికే రావు.. మీరు నిద్రపోతూ ఇచ్చే రేటింగ్ చాలా ప్రధానమైంది. ఈ ఐదు రోజుల్లో ప్రతి రోజు వారికి నిద్ర ఎలా పట్టిందనే విషయంపై 1 నుండి 10 వరకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.

పగలు రాత్రి ఏంటా నిద్ర పని పాడు లేకుండా.. అని అమ్మా నాన్న తిడుతుంటే నిద్రపోతూ కూడా లక్షలు సంపాదించొచ్చట నాన్నా అని ఆయన్ని కన్విన్స్ చేసేయొచ్చండోయ్. మరి అయిదు రోజులు నిద్ర పోతే ఏకంగా రూ.14 లక్షలు ఇస్తారట. నిజంగా ఏక్కడో చెప్తే ఇమ్మీడియట్‌గా అప్లై చేస్తారా.. అయితే ఆగండి.. ఈ స్టోరీ చదవండి.. ఇలాంటి అద్భుతమైన అవకావం కల్పిస్తోంది ఒక హెల్త్ అడ్వైజ్ వెబ్‌సైట్.

ఈ సరికొత్త ఉద్యోగానికి ఎంపికైన వారు ఐదు రోజుల పాటు వారు చెప్పిన ప్రదేశాల్లో నిద్రపోవాల్సి ఉంటుంది. ఇందుకుగాను వారికి రూ.14.5 లక్షలు చెల్లిస్తారు. దీనిపై ఆ వెబ్‌సైట్ ప్రకటన చేస్తూ.. వివిధ ప్రాంతాల్లోని పర్యావరణ పరిస్థితులు ప్రజల నిద్ర నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయనే విషయంపై అధ్యయనానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి ఒక రాత్రి ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో నిద్రపోవాల్సి ఉంటుంది.

Also Read: అనసూయ షాక్.. ఈ ఫోటో నీకెక్కడ దొరికిందంటూ..!

ఆ తర్వాత మిగిలిన నాలుగు రోజులు వివిధ వాతావరణ పరిస్థితుల్లో నిద్ర పోతారు. ఈ ఐదు రోజుల్లో ప్రతి రాత్రి వారికి కొత్త వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ వాతావరణంలో వారి నిద్ర అనుభవాలను తెలుసుకుంటాం. వారి నిద్ర నాణ్యత పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి ద్వారా తెలుసుకుంటాం అని పేర్కొంది.

మార్చి 30 వరకు దరఖాస్తుకు అవకాశం..

డబ్బులు ఊరికే రావు.. మీరు నిద్రపోతూ ఇచ్చే రేటింగ్ చాలా ప్రధానమైంది. ఈ ఐదు రోజుల్లో ప్రతి రోజు వారికి నిద్ర ఎలా పట్టిందనే విషయంపై 1 నుండి 10 వరకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతి రోజు నిద్ర అనుభవాన్ని నివేదిక రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఆయా ప్రాంతాల్లో నిద్ర నాణ్యతను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటారు. కాగా ఈ ఉద్యోగానికి అభ్యర్థులు మార్చి 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని వెబ్‌సైట్ స్పష్టం చేసింది. సరిగ్గా ఇలాంటి జాబ్‌నే ఆఫర్ చేసింది బెంగళూరుకు చెందిన వేక్ ఫిట్ అనే మ్యాట్రెస్ తయారీ సంస్థ.

Also Read: మెగాస్టార్ చిరంజీవికి ఆంగ్ల చిత్రం 'అబు'లో నటించే అవకాశం వచ్చినా..

మరొక సంస్థ కూడా ఇలాంటి ఆఫర్‌తో వచ్చింది. వినియోగదారులకు ఎలాంటి పరుపులు తయారు చేయాలన్న విషయంపై అధ్యయనం చేసేందుకుగాను స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రారంభించింది. ఈ ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వారు 100 రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోవాలి. ఈ పోటీలో ఎంపికైన వారికి లక్ష రూపాయలు, విజేతలైన వారికి 10 లక్షలు ఇస్తామని ప్రకటించింది.

మంచి ఉద్యోగాలే.. పడుకుని కూడా పైసల్ సంపాదించొచ్చన్నమాట అని అనుకుంటున్నారు కదూ.. మరింకెందుకు ఆలస్యం త్వరగా అప్లై చేసేయండి.

Tags

Read MoreRead Less
Next Story