సముద్రంలో ఒక్కటైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు!

సముద్రంలో ఒక్కటైన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు!
ఈ వినూత్న పెళ్లి చేసుకోవడం కోసం ఈ జంట మూడ్రోజుల పాటు ఈతలో శిక్షణ తీసుకోగా.. పెళ్లి ఫీల్ రావడం కోసం నీటి లోపల అరటి తోరణాలను కూడా ఏర్పాటు చేశారు.

కొత్తగా ఆలోచించిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల జంట వినూత్నంగా వివాహం చేసుకుంది. కోయంబత్తూరుకు చెందిన శ్వేత, తిరువన్నమలైకి చెందిన చిన్నదురై సముద్రం నీటి లోపల వివాహం చేసుకోగా.. అడ్వెంచర్ డైవ్ సెంటర్ సాయంతో సముద్రతీరానికి 5KM దూరంలో 60 అడుగుల లోతులో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు.

ఈ వినూత్న పెళ్లి చేసుకోవడం కోసం ఈ జంట మూడ్రోజుల పాటు ఈతలో శిక్షణ తీసుకోగా.. పెళ్లి ఫీల్ రావడం కోసం నీటి లోపల అరటి తోరణాలను కూడా ఏర్పాటు చేశారు. చెన్నై శివారు ప్రాంతం నీలాంగరై సముద్ర తీరంలో సోమవారం ఈ వినూత్న వివాహ తంతు జరిగింది.

ఈ సందర్భంగా చిన్నదురై మాట్లాడుతూ.. సముద్రగర్భంలో పేరుకుపోతున్న చెత్త గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకే తామీ సాహసం చేశామని పేర్కొన్నాడు. దాదాపుగా ఈ జంట 45 నిమిషాల పాటు నీటిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story