జిమ్‌లో కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తున్న తమిళనాడు సీఎం ..!

ఆరోగ్యమే మహాభాగ్యమన్న పెద్దలు మాటలను తూ.చ పాటిస్తూ జిమ్‌లో కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తూ.. మరోసారి సోషల్‌ మీడియా స్టార్‌గా అవతరించారు.

జిమ్‌లో కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తున్న తమిళనాడు సీఎం ..!
X

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆరోగ్యమే మహాభాగ్యమన్న పెద్దలు మాటలను తూ.చ పాటిస్తూ జిమ్‌లో కండలు కరిగిస్తూ.. చెమటలు చిందిస్తూ.. మరోసారి సోషల్‌ మీడియా స్టార్‌గా అవతరించారు. 68 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా చాలా చురుగ్గా ఉండే స్టాలిన్‌ ఫిట్‌నెస్‌ మంత్రాతో అందర్నీమెస్మరైజ్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన కసరత్తుల వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. తలైవర్‌ ఫిట్‌నెస్‌ వర్కౌట్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు.

ఎంత బిజీగా ఉన్నా శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ ప్రముఖుల్లో సీఎం స్టాలిన్‌ ఒకరు. త్వరగా నిద్ర లేవడం, నడక, సైక్లింగ్‌, యోగా తన దినచర్యలో ఒక భాగమనీ ఇదివరకే డీఎంకే నేత స్టాలిన్‌ ప్రకటించారు. ఏ పనిలోఉన్న పది రోజులకోకసారి సైకిల్ తొక్కుతానని, కర్ణాటక సంగీతం వినడం కూడా తనకు చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మామల్లాపురం రోడ్డుపై ఉదయాన్నే సైక్లింగ్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.


Next Story

RELATED STORIES