Weirdest Wedding..వింత పెళ్లిళ్లు.. శవంతో పెళ్లి..కూతురితో పెళ్లి.. కిడ్నాప్ చేసి పెళ్లి

Weirdest Wedding..వింత పెళ్లిళ్లు.. శవంతో పెళ్లి..కూతురితో పెళ్లి.. కిడ్నాప్ చేసి పెళ్లి
Weirdest Wedding Traditions.. విశాల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు

Weirdest Wedding Traditions..

పెళ్లి విషయంలో ప్రపంచంలో రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కూతురిని తండ్రి పెళ్లి చేసుకోవటం.. కొడుకు భార్యని అంటే కోడలిని మామ వివాహం చేసుకోవటం. పెళ్లిలో వరుడికి వధువు తాళి కట్టడం. వామ్మో పెళ్లి అంటే వావి వరుసలు మరచి.. ఆచరాలతో పేరుతో ఇలా కూడా చేసుకుంటారా.. అని ఆశ్చర్యపోకండి..ఇంతకంటే వింతలు చాలా ఉన్నాయి. ఈ విశాల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఓ గ్రామం వందల ఏళ్ల క్రితమే విన్నూతంగా ఆలోచించింది. ఆ ఊరే ఓ కళ్యాణమండపంగా మారింది. మత్స్యకారుల గ్రామమైన..నువ్వలరేవు అనే ఊరిలో రెండు లేదా మూడేళ్లకు ఒక్కసారి..సామూహికంగా పెళ్లిళ్లు జరుగుతాయి. ఒకే ముహూర్తంలో వందల సంఖ్యలో పెళ్లిళ్లు చేస్తారు. ఇప్పుడు పదుల సంఖ్యలో మాత్రమే వివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉండేవాళ్లు.. వేరే గ్రామస్థులను పెళ్లి చేసుకోరు. ఆ గ్రామంలో ఉన్న బంధువుల కుటుంబాలతోనే సంబంధం కలుపుకుంటారు. ఇక ఇక్కడ జరిగే పెళ్లిలో వరకట్నం మాట లేదు. ఇక్కడ జరిగే వింత ఆచారం ఏంటంటే.. పెళ్లికొడుకు మెడలో పెళ్లికూతురు కూడా తాళి కడుతుంది. 400 ఏళ్ళ క్రితం నుంచి ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు. వరుడు కట్టిన తాళి వధువుకి.. వధువు కట్టే తాళి వరుడికి రక్ష అని వీళ్ల నమ్మకం. ఈ వింత ఆచారంతో.. నువ్వల రేవు పేరు మారుమోగుతోంది.

ఇక మీరు నమ్మలేని నిజం ఏంటంటే.. కూతురిని పెళ్లిచేసుకేనే తండ్రులు ఉన్నారు. కాకపోతే ఇది ఆచారం కాదు.. అక్కడి చట్టం. ఆ దేశ చట్టాల ప్రకారం కూతురిని తండ్రి పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొన్ని షరతులు ఉన్నాయి. కండిషన్ ఏంటంటే.. వధువు 13 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఆమె తన దత్తపుత్రిక అయి ఉండాలి. ఇరాన్ దేశంలో తండ్రి తన కుమార్తెను పెళ్లి చేసుకునే.. ఈ చట్టాన్ని 2013లో ఆమోదించారు. ఔరా అనిపించే మరో ఆచారం ఏంటంటే పెళ్లిలో.. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేయడం. కిడ్నాప్ ఏంటీ.. ఔరా అనిపించటం ఏంటీ అనుకుంటున్నారా..! ఇండోనేసియాలోని సుంబా దీవిలో.. ఏ కుర్రాడికైనా అమ్మాయి నచ్చితే.. కిడ్నాప్ చేస్తాడు.. అలా ఎత్తుకెళ్లిపోయాడంటే.. ఆమెను పెళ్లి చేసుకోవాలనేదే అతడి ఉద్దేశం. అలా కిడ్నాప్ చేసిన అమ్మాయిని తరువాత పెళ్లి చేసుకుంటాడు. అక్కడ కుర్రాలకు అమ్మాయి నచ్చితే తీసుకెళ్లిపోవటం.. తరువాత ఆచారం ప్రకారం పెళ్లి జరిగిపోవటం.. అంతా చకచకా జరిగిపోతాయి. మరి ఆ అమ్మాయికి ఆ కుర్రాడు నచ్చకుంటే.. ఆమె పరిస్థితి ఏంటీ అనే ఆలోచన మీకు రావచ్చు.. అందుకే ఇలాంటి ఆచారాలపై ప్రపంచ మహిళా సంస్థలు పోరాటం చేస్తున్నాయి. ఇండోనేసియా ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉంది.

ఇక దక్షిణ సూడాన్‌లో పాటించే ఆచారాలు గురించే తెలిస్తే.. ముక్కున వేలు వేసుకుంటారు. వార్ని.. ఇదేం దిక్కుమాలిన ఆచారంరా బాబు అని తలలు పట్టుకుంటారు. ఇంతకీ అదేంటి అంటారా.. ఇక్కడి అమ్మాయిలను శవాలకు ఇచ్చి పెళ్లి చేసే సంప్రదాయం ఉంది. ఎవరి ఇంట్లోనైనా.. ఒకరు చనిపోతున్నాడని తెలిస్తే చాలు.. వెంటనే అమ్మాయి తరఫువాళ్లు ఆ ఇంటికి వెళ్లి సంబంధం కలుపుకుంటారు. వరుడు బకెట్ తన్నగానే.. శవంతో పెళ్లి చేస్తారు. ఇక్కడ ఇంకో వింత ఏంటంటే.. మృతి చెందిన వ్యక్తికి బ్రదర్ ఉంటే.. ఆ నవ వధువు వారితోనే సంసారం చేయాలి. శవాన్ని పెళ్లి చేసుకునే అమ్మాయిని వితంతువుగా అక్కడ భావించరు. పెళ్లయిన మహిళగానే గౌరవిస్తారు. భర్త తమ్ముళ్లతో సంసారం చేసినా.. ఆమె వారికి భార్య కాదు.

ఇక సూడాన్‌లో కన్యాశుల్కం లాంటి ఆచారం కూడా ఉంది. ఇక్కడ డింకా, న్యూర్ తెగకు చెందిన గిరిజన అమ్మాయిలను వేలానికి పెడతారు. ఎక్కవ డబ్బులు, విలువైన వస్తువులను ఇచ్చి వధువును సొంతం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో జరిగిన పెళ్లిలో ఓ వ్యాపారవేత్త.. వధువు తండ్రికి 500 పశువులు, 3 లగ్జరీ కార్లు, లక్ష 44 వేల రూపాయలను కట్నంగా ఇచ్చి 17 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్నాడంటే.. అక్కడి అమ్మాయిలను ఎలా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story