చీపురు తిరగేసి.. బాస్‌ని చితకబాది..

ఇంకోసారి ఇలాంటి వెధవ్వేషాలు వేసావంటే ఏరుకోడానికి ఎముకలు కూడా లేకుండా చేస్తా. నీకు అక్కచెల్లెళ్లు, భార్యా బిడ్డలు ఉన్నారుగా. అయినా ఆడవాళ్లను చూడగానే అలా చొంగ కారుస్తారేంట్రా వెధవ సన్నాసుల్లారా.

చీపురు తిరగేసి.. బాస్‌ని చితకబాది..
X

ఇంకోసారి ఇలాంటి వెధవ్వేషాలు వేసావంటే ఏరుకోడానికి ఎముకలు కూడా లేకుండా చేస్తా. నీకు అక్కచెల్లెళ్లు లేరా. భార్యా బిడ్డలు ఉన్నారుగా. అయినా ఆడవాళ్లను చూడగానే అలా చొంగ కారుస్తారేంట్రా వెధవ సన్నాసి. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేసి ఏం లాభం. బుద్ది మారకపోతే.. ఇంతటితో వదిలేస్తున్నా. ఇంకెప్పుడైనా ఇలా చేసావంటే చంపి పాతేస్తా.. ఎంత ధైర్యం ఆ చైనా అమ్మాయికి. అందరు ఆడవాళ్లు ఇలా ఉంటే ఎంత బావుండు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్స్ ఆమెని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

చైనాలో ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగికి ఆమె బాస్ అసభ్యకరమైన పదజాలంతో టెక్స్ట్ సందేశాలను పంపుతుండేవాడు. ఎన్ని సార్లు వార్నింగ్ ఇచ్చినా మళ్లీ అదే వరస. చివరికి లాభం లేదని రంగంలోకి దిగింది. ఇల్లు క్లీన్ చేసి మాపింగ్ స్టిక్ తీసుకుని దాన్ని తిరగేసి బాస్‌ని కుళ్లబొడిచింది. తాను చేసిన పని మరికొందరికి స్ఫూర్తి కావాలని తానే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇలాంటి బాసులు మీకూ ఉండవచ్చు. భయపడకండి. దైర్యంగా ఎదుర్కోండి అంటూ ఓ సందేశాన్ని కూడా జోడించింది. ఆమె కొడుతున్నప్పుడు బాస్ తీన ముఖాన్ని చేతులతో కప్పి ఉంచుకున్నాడు. క్షమించమని వేడుకున్నాడు. అయినా ఆమె ఊరుకోలేదు. కుక్కతోక వంకరలా నీ బుద్ధి మారదు. మూతో, ముక్కో పచ్చడైతే కానీ దారికి రావు అంటూ వీరలెవల్లో ఉతికి ఆరేసింది. అక్కడే బాస్ డెస్క్ మీద ఉన్న పుస్తకాలను కూడా తీసి తలపై కొట్టింది.

ఈ వీడియో వైరల్ అయ్యింది. తన సహోద్యోగులను రక్షించడానికి పోరాడినందుకు చాలా మంది ఆమెను ప్రశంసించారు. "కార్యాలయంలో మహిళలు వేధింపులకు గురైనప్పుడు, వారు కఠినంగా ఉండాలి" అని ఒకరు చెప్పారు.

చైనాకు చెందిన ప్రముఖ స్త్రీవాద కార్యకర్త లు పిన్ మీడియాతో మాట్లాడుతూ, లైంగిక వేధింపులను దర్యాప్తు చేయడం చాలా కష్టం కనుక మహిళలు నిశ్శబ్దంగా ఉండవలసి వస్తుంది. ఈ మహిళ తనను తాను రక్షించుకోవడానికి మరొకరి సాయం కోరలేదు. ఇది నిజంగా హర్షనీయం.

వీడియో వైరల్ అయిన తరువాత, ఏజెన్సీలో డైరెక్టర్‌గా ఉన్న బాస్ వాంగ్‌కి జీవిత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అధికారిక విధుల నుండి తొలగించబడ్డారని అంతర్గత దర్యాప్తులో తేలింది.


Next Story

RELATED STORIES