షాకింగ్.. అన్నంతోపాటు పొట్టలోకి చేరుతున్న ప్లాస్టిక్!

మనం అన్నంతో పాటు.. ప్లాస్టిక్‌ కూడా తింటున్నామట. వారానికి 5 గ్రాములు లాగించేస్తున్నామని ఆస్ట్రేలియాకు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనంలో స్పష్టమైంది. అతి సూక్ష్మమైన పరిమాణంలో ఉండే ప్లాస్టిక్‌ను వివిధ రూపాల్లో మనకు తెలీకుండానే తినేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బాటిల్ వాటర్, ప్లాస్టిక్ కుళాయి ద్వారా వచ్చే తాగునీరు, షెల్ ఫిష్, బీర్లు, ఉప్ప తదితర పదార్థాల ద్వారా ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ కడుపులోకి చేరుతోంది.

వారానికి 5 గ్రాముల ప్లాస్టిక్ అంటే.. చాలా తక్కువే అనిపిస్తుంది. కానీ.. అది ఏడాదికి పావుకిలోతో సమానం అవుతోందని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. భవిష్యత్‌లో ఇది చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చని హెచ్చరించారు. కేవలం ఆహార పదార్థాలు, పానీయాల ద్వారానే కాదు.. గాలి ద్వారా కూడా ప్లాస్టిక్‌ను పీలుస్తున్నామని అధ్యయనంలో తేలింది. కంటికి కనిపించని రేణువుల రూపంలో ప్లాస్టిక్‌ గాల్లో చేరిపోయిందని.. దాన్ని మనం పీలుస్తున్నామని చెప్తున్నారు. నోటి ద్వారా ఎంత ప్లాస్టిక్ తింటున్నామో.. అంతే పరిణామంలో ముక్కు ద్వారా కూడా శరీరంలోకి చేరుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ప్రపంచాన్ని కబళించేయబోతున్న ప్లాస్టిక్‌ భూతానికి విరుగుడు కనిపెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. వీలైనంత వరకు ఆయా వస్తువుల వినియోగాన్ని తగ్గించేయడం మంచిదని సూచిస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *