Zoe Bernard: కేసు నుండి తప్పించుకోవడానికి చచ్చిపోయినట్టు నటించిన మహిళ.. చివరికి..

Zoe Bernard: కేసు నుండి తప్పించుకోవడానికి చచ్చిపోయినట్టు నటించిన మహిళ.. చివరికి..
Zoe Bernard: లండన్‌కు చెందిన జో బెర్నాడ్ అనే మహిళకు సరిగ్గా డ్రైవింగ్ రాదు.

Zoe Bernard: ఒక తప్పు చేసి ఆ తప్పు నుండి తప్పించుకోవడానికి కొంతమంది ఎంత లిమిట్‌కు అయినా వెళతారు. అలాంటివి కొన్ని వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే లండన్‌కు చెందిన ఓ మహిళ ఓ కేసు నుండి శిక్షను తప్పించుకోవడానికి తాను చనిపోయినట్టుగా అందరినీ నమ్మించింది. కొన్నాళ్లు పోలీసులు కూడా అది నిజమే అనుకున్నారు. కానీ ఇన్నాళ్లకు నిజం బయటికి వచ్చింది.

లండన్‌కు చెందిన జో బెర్నాడ్ అనే మహిళకు సరిగ్గా డ్రైవింగ్ రాదు. 2019లో మొదటిసారి జో డ్రంక్ అండ్ డ్రైవింగ్‌లో పోలీసులకు చిక్కింది. అప్పుడు పోలీసులు ఆమెను మందలించడంతో పాటు సంవత్సరం పాటు డ్రైవింగ్ చేయకూడదని చెప్పారు. కానీ జో వినలేదు. 2020లో ర్యాష్ డ్రైవింగ్ చేస్తుందని జోను పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు కారు ఆపడం ఆమెకు రాలేదు. ఆ సమయంలో తన పేరు కైషా బెర్నాడ్ అని చెప్పింది జో.

కారు ఆపలేకపోయిన కారణంగా తనకు డ్రైవింగ్ రాకపోయినా.. రోడ్డుపై డ్రైవ్ చేస్తోందని పోలీసులు జోపై కేసు నమోదు చేశారు. ఆ కేసు గురించి కనుక్కోవడానికి ఒకసారి పోలీసులు జో ఇంటికి ఫోన్ చేయగా.. జో ఆరోగ్యం బాలేదని, తాను జో చెల్లిలు అని వారిని నమ్మించింది. మెల్లగా అనారోగ్యం వల్ల జో చనిపోయిందని అబద్ధం చెప్పింది. అంతే కాకుండా ఈ అబద్ధానికి ఒక ప్రూఫ్ కావాలి అని డెత్ సర్టిఫికెట్‌కు కూడా అప్లై చేసింది. అక్కడే జో దొరికిపోయింది. దీంతో పోలీసులు ఆమెకు జైలు శిక్ష విధించారు.

Tags

Read MoreRead Less
Next Story