అక్కడ భూకంపాల భయం.. బిక్కుబిక్కుమంటున్న జనం

అక్కడ భూకంపాల భయం.. బిక్కుబిక్కుమంటున్న జనం
ఇండో నేషియా, న్యూజిలాండ్ లను భూకంపాలు కుదిపేస్తున్నాయి

ఇండో నేషియా, న్యూజిలాండ్ లను భూకంపాలు కుదిపేస్తున్నాయి. ఏప్పుడు ఏమూల నుంచి భూమి కంపించి తమ మీద పడుతుందో అర్ధంకాక ఇక్కడి ప్రజలు ప్రాణాలకు గుప్పెట్లో పట్టుకుని కాలం వెళ్లబుచ్చుతున్నారు గతనాలుగు రోజుల క్రితం ఇండో నేషియాను ఒక్కరోజులోనే రెండు సార్లు వచ్చి కుదిపేసింది. తాజాగా న్యూజిలాండ్ లోనూ భూమి కంపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది.

కెర్మాడెక్ దీవుల్లో సోమవారం సంభవించిన భారీ భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.2 తీవ్రతగా నమోదయింది. ఉదయం 6:11:52 సెకన్లకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్రకటించింది. కెర్మాడెక్ దీవుల్లో పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించింది. కెర్మాడెక్ దీవుల్లో భూకంపం తర్వాత న్యూజిలాండ్ లో ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story