Australia : చేపలు పట్టడానికి వెళ్తే మొసలి తినేసింది

Australia : చేపలు పట్టడానికి వెళ్తే మొసలి తినేసింది

చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన వ్యక్తి మొసలికి ఆహారం అయ్యాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని ఉత్తర క్వీన్స్ ల్యాండ్ లో జరిగింది. కేవిన్ డార్మొడి అనే 65 ఏళ్ల వ్యక్తి శనివారం చేపలు పట్టాడినికి వెళ్లి తప్పిపోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. కేవిన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేవిన్ చేపలు పట్టడానికి వెళ్లిన ప్రదేశంలో రెండు మొసళ్ల దగ్గర మానవ అవయవాలు పడి ఉన్నట్లుగా కనుగొన్నారు. అవి కేవిన్ వేనని పోలీసులు దృవీకరించుకున్నారు.

కేవిన్ వెళ్లిన ప్రదేశానికి పక్కనే ఓ పబ్ మేనేజర్ తో కలిసి కొందరు వ్యక్తులు అదే రోజు చేపలు పడుతున్నారు. ఎవరో చేరువులో పడిపోయినట్లు కనుగొన్నామని అప్పుడు ఆ వ్యక్తి కేకలు పెట్టాడని చెప్పారు. తాము గన్ తీసుకుని వెళ్లి చూస్తే ఎవరూ కనిపించలేదని తెలిపారు. అప్పటికీ మొసళ్లు అక్కడ ఉన్నాయని వాటి దగ్గర మానవ అవయవాలు కనిపించడంతో వాటిని తాము చంపినట్లు చెప్పారు. అందులో ఒకటి 14అడుగులు, మరొకటి 9 అడుగులు ఉన్నట్లు తెలిపారు. మానవ అవయవాలను పరిశీలించగా అవి కేవిన్ వేనని పోలీసులు తెలిపారు. 130 మంది జనాభా ఉన్న గ్రామీణ ఉత్తర క్వీన్స్‌లాండ్ పట్టణం లారాకు చెందిన వ్యక్తి కేవిన్ అని స్థానికులు తెలిపారు. అతను చాలా మంచి సహచరుడని అన్నారు. ప్రజలు మొసళ్లతో అప్రమత్తంగా ఉండాలని క్వీన్స్‌లాండ్ రాష్ట్ర వన్యప్రాణి అధికారి మైఖేల్ జాయిస్ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story