మరోసారి వడ్డీ రేట్లు పెంచిన అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌

మరోసారి వడ్డీ రేట్లు పెంచిన  అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌
పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా 0.25 శాతం వడ్డీరేట్లు పెంచడంతో 16 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న ధరలను స్థిరీకరించేందుకు మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. తాజాగా 0.25 శాతం వడ్డీరేట్లు పెంచడంతో 16 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లు పెంచడం గత 14 నెలల్లో ఇది పదోసారి. పెంచిన ప్రకారం ప్రస్తుతం వడ్డీ రేట్లు 5 నుంచి 5.25 శాతానికి చేరుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో కీలక వడ్డీ రేట్లు పెరుగుతుండడంతో హౌసింగ్‌, కీలక వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడనుంది. అయితే వడ్డీరేట్ల పెంపు ఇదే చివరిది కావచ్చని ఫెడ్‌ సంకేతాలు ఇచ్చింది. ద్రవ్యోల్బణం తారా స్థాయికి చేరడంతో కట్టడి చేసేందుకు ఫెడరల్‌ రిజర్వ్‌ గతకొన్ని నెలలుగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story