USA: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

USA: అమెరికాలో  మరోసారి  కాల్పుల మోత
ఒకరి మృతి, 22 మందికి గాయాలు

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. మిజోరీలోని కేన్సాస్ సిటీలో గురువారం వెలుగు చూసిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 22 మంది గాయాల పాలయ్యారు. సూపర్ బౌల్ అనే ఫుట్‌బాల్ లీగ్‌లో విజేతగా నిలిచిన కేన్సాస్ సిటీ చీఫ్స్ జట్టు నిర్వహించిన పరేడ్‌‌లో ఈ ఘటన జరిగింది. వేల మంది పాల్గొన్న ఈ పరేడ్‌లో కాల్పులతో ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పుల నుంచి తప్పించుకునేందుకు జనాలు తలో దిక్కుకు పరుగులు తీయడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 17 ఏళ్లలోపు ఉన్న 12 మందికి కాన్సాస్ సిటీలోని చిల్డ్రన్స్ మెర్సీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో వారిలో 11 మంది పిల్లలే. వీరిలో తొమ్మిది మంది తుపాకీ గాయాలకు గురయ్యారు.


అమెరికాలోని మీసోరి రాష్ట్రంలో జరిగిన సూపర్ బౌల్ అనే ఫుట్‌బాల్ లీగ్‌లో సూపర్ ఫైనల్ జరిగింది. ఇందులో ‘కాన్సాస్ సిటీ చీఫ్స్’ అనే జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా నగరంలో కవాతు నిర్వహించారు. ఆ కార్యక్రమాలలోనే కాల్పులు వెలుగు చూశాయి. ఈ కవాతులో పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక ముగుస్తుందండగా కాల్పుల ఘటన వెలుగు చూసింది. ముందుగా ఈ మార్చ్ కు సమీపంలో ఉన్న పెట్రోల్ పంపు నుండి కాల్పులు జరిగిన శబ్దం వినిపించింది.


ఈ శబ్దాలు విన్న వెంటనే అక్కడికి కవాతులో పాల్గొన్న వారంతా భయంతో పరుగులు తీయడం దాక్కోవడం మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో అనుమానితులుగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీస్ చీఫ్ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే ఇలా దాడి చేయడానికి కారణాలేంటో ఇంకా తెలియ రాలేదని తెలిపారు. సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన వెనక కారణాలు ఏంటో తెలియాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు, కాల్పుల ఉదంతంపై కేన్సాస్ సిటీ చీఫ్స్ నిర్వాహకులు విచారం వ్యక్తం చేశారు. పరేడ్ ముగిసే సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని, ఇదో అవివేకమైన హింస అని వ్యాఖ్యానించారు. అయితే, తమ టీం ఆటగాళ్లు, కోచ్‌లు ఇతర సిబ్బంది క్షేమంగానే ఉన్నారని తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story