CAANepal : భారత్, నేపాల్ విమానాలకు తప్పిన ప్రమాదం.!?

CAANepal : భారత్, నేపాల్ విమానాలకు తప్పిన ప్రమాదం.!?

ఎయిర్ ఇండియా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానాలు అతిసమీపంగా వచ్చాయి. ఈ విషయాన్ని నేపాల్ విమానయాన సంస్థ తెలిపింది. రెండు విమానాలు దాదాపు ఢీకొన్నంత పనిచేశాయని అన్నారు అధికారులు. "అజాగ్రత్త" కారణంగా నేపాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ విభాగానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను నేపాల్ పౌర విమానయాన అథారిటీ (CAAN) సస్పెండ్ చేసినట్లు CAAN ప్రతినిధి జగన్నాథ్ నిరౌలా తెలిపారు. శుక్రవారం ఉదయం మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఖాట్మండుకు వస్తున్న నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 విమానం, న్యూఢిల్లీ నుంచి ఖాట్మండుకు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం దాదాపు ఢీకొన్నాయి. ఎయిర్ ఇండియా విమానం 19,000 అడుగుల నుంచి కిందికి దిగుతుండగా, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం అదే ప్రదేశంలో 15,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని నిరౌలా చెప్పారు.

రెండు విమానాలు సమీపంలో ఉన్నాయని రాడార్‌లో చూపిన తర్వాత, నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానం 7,000 అడుగులకు దిగిందని అధికార ప్రతినిధి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు పౌర విమానయాన అథారిటీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఘటన జరిగినప్పుడు కంట్రోల్‌ రూంకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముగ్గురు అధికారులను CAAN సస్పెండ్ చేసింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story