ఆఫ్రికాలో కొత్త వైరస్‌.. సోకిన కొన్ని గంటల్లోనే మృతి

ఆఫ్రికాలో కొత్త వైరస్‌.. సోకిన కొన్ని గంటల్లోనే మృతి
వైరస్ సోకిన వారి ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారు

ఆఫ్రికాలోని బురుండిలో కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇది స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ సోకిన వారి ముక్కు నుంచి తీవ్రంగా రక్తస్రావం జరిగి కొన్ని గంటల్లోనే మరణిస్తున్నారు. బజిరో ప్రాంతంలో వైరస్ సోకి రక్తస్రావం జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు చనిపోయారు. దీని బారిన పడిన వారిలో జ్వరం, తల నొప్పి, నీరసం, వాంతులు వంటి లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ లక్షణాలతో ఆస్పత్తుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతోంది. వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో దీన్ని నియంత్రించ డానికి ప్రభుత్వం నగరంలోని ప్రజలంతా క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story