Gaza: గాజాలో వేల ఏళ్ల నాటి సమాధులు

Gaza: గాజాలో వేల ఏళ్ల నాటి సమాధులు
గాజాలో 2వేల ఏళ్ల నాటి సమాధులను గుర్తించిన పురావస్తు శాఖ.. 125 సమాధులు గుర్తింపు.. రెండు సమాధులపై చిత్రాలు..

గాజా( Gaza) నగరం.. వేల ఏళ్ల నాటి చరిత్రను, తరతరాల సంస్కృతిని తనలో దాచుకున్న నగరం. పాలస్తీనా( Palestina)లోని ఈ నగరంలో ఇప్పటికే ఎన్నో చారిత్రక ఆనవాళ్లు, వేల ఏళ్ల నాటి ప్రజల జీవన స్థితిగతులను ప్రపంచానికి చాటిచెప్పాయి. నిత్యం రాకెట్ల దాడులు, బాంబుల మోతలతో దద్దరిల్లే గాజా భూ పొరల్లో పురాతన ప్రజల సంస్కృతిని చాటే అపార సంపద ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తుంటారు. దశాబ్దాలుగా ఎడతెగని హింసతో రావణ కాష్టంలా రగిలిపోతున్న గాజాలో తాజాగా సుమారు 2 వేల ఏళ్ల నాటి( 2,000-year-old) సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు( Archaeologists ) కనుగొన్నారు(discovered ).


గతేడాది వెలుగు చూసిన పురాతన రోమన్‌ శ్మశాన వాటిక( Roman-era cemetery in Gaza ) లో తవ్వకాలు జరుపుతుండగా ఈ సమాధులు వెలుగు చూశాయని అధికారులు తెలిపారు. మొత్తం 125 సమాధుల(125 tombs found)ను గుర్తించగా వీటిల్లో రెండు శవపేటికలపై వివరాలు కూడా ఉన్నాయని పాలస్తీనా పురావస్తుశాఖ మంత్రి పేర్కొన్నారు. వివరాలున్న శవపేటికలపై ద్రాక్షలు, డాల్ఫిన్ల చిత్రాలున్నాయని వెల్లడించారు. గత ఏడాది గృహ నిర్మాణ ప్రాజెక్టు కోసం తవ్వుతుండగా ఇక్కడ కొన్ని సమాధులను గుర్తించారు. స్థానిక అధికారులు వీటిల్లో కొన్నింటిని వెలికితీసినా ఆ తర్వాత పెద్దగా ఆధారాలు లభించక పూడ్చిపెట్టారు.


కానీ, ఫ్రాన్స్‌కు చెందిన ఓ సంస్థ వీరి తవ్వకాలకు సహకరించింది. తొలిసారి పాలస్తీనాలో మేము 125 పురాతన సమాధులున్న శ్మశాన వాటిక(125 tombs have been found )ను గుర్తించామని ఫ్రెంచ్‌ స్కూల్‌ ఆఫ్‌ బైబ్లికల్‌ పురవాస్తు పరిశోధన సంస్థ( French organizations) పరిశోధకుడు ఫదెల్‌ తెలిపారు. వీటిల్లో రెండింటిపై వివరాలున్నాయని, వీటిని భద్రపర్చడానికి నిధులు అవసరం. చరిత్ర కనుమరుగు కాకూడదని ఆయన వ్యాఖ్యానించారు.


4 వేల చదరపు మీటర్లు( 4,000 square meters) విస్తరించి ఉన్న ప్రదేశంలో ఇప్పటివరకు 125 సమాధులను గుర్తించామని పాలస్తీనా పురావస్తు శాఖ జనరల్ డైరెక్టర్ జమాల్ అబ్దు రైడా( Jamal Abdu Raida) వెల్లడించారు. ఈ పురాతన సమాధులను గుర్తించడం చాలా అపూర్వమైనదన్న ఆయన.. నెక్రోపోలిస్‌లో ఉన్నత స్థాయి రోమన్ అధికారుల అవశేషాలు ఇందులో ఉన్నాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. పురావస్తు అధికారులు అస్థిపంజరాలను శుభ్రం చేస్తున్నారని, ఈ సమాధుల్లో మట్టి పాత్రలు కూడా దొరికాయని వాటన్నింటినీ ఒక దగ్గర చేర్చి, ఒక రూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రైడా వివరించారు.


చరిత్ర అంతమవ్వకుండా ఈ పురావస్తు ప్రదేశాన్ని సంరక్షించడానికి తమకు నిధులు అవసరమని ఆయన వెల్లడించారు. ఈ చారిత్రక సంపదను రక్షించడం ద్వారా పాలస్తీనా సంస్కృతి, వారసత్వం ఉనికిని ప్రపంచానికి చూపించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story