Venezuela: 17 వాహనాలు ఢీ కొనడంతో చెలరేగిన మంటలు.. 16 మంది మృతి

Venezuela:  17 వాహనాలు ఢీ కొనడంతో చెలరేగిన మంటలు.. 16 మంది మృతి
వెనెజులాలో ఘోర ప్రమాదం

వెనెజులాలో విషాదం చోటుచేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మరకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదావాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. వెనెజులాలోని ఓ హైవేపై వాహనాలు ఎప్పట్లాగే వెళ్తున్నాయి. అయితే ఓ ట్రక్కు అతివేగంగా వెళ్తోంది. చివరకి అది అదుపుతప్పి పలు కార్లను ఢీకొంది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలు కార్లు, ఓ బస్సుతో పాటు మొత్తం 17 వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.

దీంతో 16 మంది ప్రాణాలు కోల్పోగా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహూటీనా ఘటనాస్థలానికి సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story