Pakistan: సౌదీ వెళుతున్న బిచ్చగాళ్లు అరెస్టు

Pakistan: సౌదీ వెళుతున్న బిచ్చగాళ్లు అరెస్టు
విమానం నుంచి దించి విచారణ..

యాత్రికుల ముసుగులో విదేశాల్లో భిక్షాటన చేయడానికి ముల్తాన్‌ విమానాశ్రయంలో సౌదీ అరేబియా విమానం ఎక్కిన 16 మంది బిచ్చగాళ్లను పాకిస్తాన్‌కు చెందిన ఫెడరల్‌ దర్యాప్తు ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) అదుపులోకి తీసుకుంది. వారిలో ఒక చిన్నారి, 11 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని ఎఫ్‌ఐఏ వర్గాలు తెలిపాయి. బిచ్చమెత్తగా వచ్చిన ఆదాయంలో సగ భాగాన్ని తమకు సహకరించిన ట్రావెల్‌ ఏజెంట్లకు తాము ఇవ్వాల్సి ఉంటుందని విచారణ సందర్భంగా వారు తెలిపారని వెల్లడించాయి.

విదేశాల్లో ఉంటున్న పాకిస్తానీయుల్లో 90 శాతం బిచ్చగాళ్లే అని ఇటీవల తేలింది. సౌదీ, ఇరాక్, యూఏఈతో పాటు ఇతర మిడిల్ ఈస్ట్ దేశాలు, యూరప్ దేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు ప్లాం ప్రకారం యాత్రికుల రూపంలో అక్కడికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఆయా దేశాల రాయబారులు పాకిస్తాన్‌కి ఫిర్యాదు చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు వెరసి పాకిస్తాన్ ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి.


ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ నుంచి సౌదీ అరేబియా వెళ్లేందుకు ప్రయత్నించిన 16 మంది బిచ్చగాళ్లను పట్టుకున్నారు. వీరింతా పాక్ నగరం ముల్తాన్ నుంచి సౌదీ వెళ్తున్న విమానంలో వీరిని గుర్తించి, విమానం నుంచి దించేశారు. పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఎజెన్సీ(FIA) రెండు రోజుల క్రితం ముల్తాన్ విమానాశ్రయంలో వీరిని అదుపులోకి తీసుకుంది. పట్టుబడిన వారిలో 11 మంది మహిళలు ఉండగా.. నలుగురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. వీరంతా పవిత్రమైన ఉమ్రా యాత్రకు వెళ్తున్నట్లుగా వీసాలు తీసుకుని, అక్కడికి వెళ్లి భిక్షాటన చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో వారంతా భిక్షాటన చేయడానికి సౌదీ వెళ్తున్నామని ఒప్పుకున్నారు. భిక్షాటన ద్వారా వచ్చే డబ్బుల్లో సగం సంపాదనను ప్రయాణ ఏర్పాట్లు చేసిన ఏజెంట్లకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉమ్రా వీసా గడువు ముగిసిన తర్వాత వారంతా సౌదీ నుంచి పాకిస్తాన్ తిరిగి వస్తారు.

ఇటీవల పాకిస్తాన్ మానవ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కీలక విషయాలను వెల్లడించింది. విదేశాలకు వెళ్తున్న పాకిస్తానీయులు భిక్షాటన చేస్తున్నారని, 90 శాతం మంది అడుక్కుంటున్నారని వెల్లడించింది. ఇరాక్, సౌదీ అరేబియా జైళ్లు భిక్షాటన చేస్తున్న పాకిస్తానీయులతో నిండిపోతున్నాయని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story