అంతర్జాతీయం

ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కాల్పులు.. 16 మంది మృతి

ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాక్ష్‌

ఆర్మేనియా, అజర్‌బైజాన్ మధ్య కాల్పులు.. 16 మంది మృతి
X

ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పద ప్రాంతమైన నాగోర్నో-కరాబాక్ష్‌ కారణంగా తలెత్తిన ఘర్షణల్లో 16 మంది మరణించగా.. సుమారు వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రాంతం విషయంలో ఇరు దేశాల మధ్య తరచూ వివాదం తలెత్తుతుంది. గత జూలైలో కూడా ఈ తరహా కాల్పులు జరగగా.. తాజాగా మళ్లీ వివాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్‌ తమ దేశానికి చెందిన 16 మందిని పొట్టన పెట్టుకుందని ఆర్మేనియా ఆరోపించింది. అయితే, అజర్‌బైజాన్‌‌కు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లను కూల్చివేసి, మూడు యుద్ధ ట్యాంకులను దెబ్బతీశాయని ఆర్మేనియా పేర్కొంది. అటు, అజర్‌బైజాన్‌ అధ్యక్షుడు ఇల్హమ్‌ అలియేవ్‌ కూడా మాట్లాడుతూ తమకు కూడా ప్రాణనష్టం జరిగిందని అన్నారు. అయితే పూర్తిస్తాయి వివరాలు వెల్లడించలేదు. ఇరు దేశాల ప్రకటనలు పరిశీలిస్తే.. మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Next Story

RELATED STORIES