Aircraft crashes: బెల్జియంలో కారుపై కుప్పకూలిన విమానం..

Aircraft crashes: బెల్జియంలో కారుపై కుప్పకూలిన విమానం..
పైలట్, ప్రయాణికుడి దుర్మరణం, కారు డ్రైవర్ సురక్షితం

ఓ తేలికపాటి విమానం రన్‌వే సమీపంలోని కారుపై కూలిన ఘటన బెల్జియంలో వెలుగు చూసింది. తూర్పు బెల్జియంలోని ఓ ఎయిరోడ్రోమ్‌లో ఆదివారం ఈ ప్రమాదం సంభవించింది. స్పా ప్రాంతంలోని ఎయిరోడ్రోమ్ పక్కన ఉన్న కారును విమానం ఢీకొన్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలోని ఇద్దరూ మృతిచెందారు. మృత పైలట్‌ను అధికారులు జర్మనీ దేశస్తుడిగా గుర్తించారు. ప్రయాణికుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.

మనిషికి మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. ఇటీవల విమాన ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక లోపాల కారణం, ఒక్కసారే వాతావరణంలో మార్పు, పక్షులు ఢీ కొనడం.. ఇలా ఎన్నో కారణాల వల్ల విమాన ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి పైలెట్లు సురక్షితంగా ల్యాండిగ్ చేస్తూ వందల మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కొన్నిసార్లు గాల్లో ఉండగానే ప్రమాదాలకు గరై ఎంతోమంది చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఓ విమానం ప్రమాద వశాత్తు రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది.


ఘటన సమయంలో కారు డ్రైవర్ సిగరెట్ కోసమని పక్కకు వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడని స్థానిక మీడియా తెలిపింది. ‘లాండింగ్ సమయంలో వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుంది’ అని పోలీసులు వెల్లడించారు. కాగా, ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. సరిగ్గా వారం రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే చిలీ దేశంలో చోటు చేసుకుంది.. ఈ ఘటనలో పైలెట్ మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం అదుపు తప్పి విద్యుత్ స్తంబానికి ఢీ కొట్టడంతో మంటలు వ్యాపించాయి. విమాన శకలాలు ఓ కారుపై పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story