Britain : కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి యువరాజు హ్యారీకి ఆహ్వానం

Britain : కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి యువరాజు హ్యారీకి ఆహ్వానం
2020లో రాజ కుటుంబం బాధ్యతల నుంచి హ్యారీ వైదొలిగిన తర్వాత రాజు పట్టాభిషేకానికి ఆహ్వానం; హ్యారీ హాజరీపై కొనసాగుతున్న సందిగ్ధత


బ్రిటన్ యువరాజు హ్యారీ, అతని భార్య మేఘన్ తన తండ్రి కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకున్నారు. అయితే వారు పట్టాభిషేకానికి హాజరవుతారా లేదా అనేది దృవీకరించలేదని హ్యారీ ప్రతినిధి తెలిపారు. ఇటీవల హ్యారీ, మేఘన్ లు రాజ కుటుంబాన్ని పలు ఇంటర్వూలలో తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. చిన్నప్పటినుంచి తనను రాజ కుటుంబం చులకనగా చూసిందని 'స్పేర్' అనే పుస్తకమే రాశాడు హ్యారీ. రాజ కుటుంబంపై సదరు పుస్తకంలో విరుచుకు పడ్డాడు.



2020లో రాజ కుటుంబం బాధ్యతల నుంచి హ్యారీ వైదొలిగిన తర్వాత రాజు పట్టాభిషేకానికి ఆహ్వానిస్తారా లేదా అతనే హాజరవుతాడా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై రాజ కుటుంబంపై పలు విమర్శలు వచ్చాయి. ఈ పరిస్థితుల మధ్య కింగ్ చార్లెస్ పట్టాభిషేకానికి హ్యారీకి ఆహ్వానం అందింది. "పట్టాభిషేకానికి సంబంధించి ఇటీవలే మెజెస్టీ కార్యాలయం నుంచి ఇమెయిల్ కరస్పాండెన్స్ ను హ్యారీ అందుకున్నట్లు నేను దృవీకరిస్తున్నాను" అని హ్యారీ ప్రతినిధి తెలిపారు. ఈ ఘట్టానికి హ్యారీ, మేఘన్ లు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story