అంతర్జాతీయం

Russia Corona Cases : రష్యాలో కరోనా విశ్వరూపం.. ఒక్క రోజులోనే 1,159 మరణాలు..!

Russia Corona Cases : రష్యాలో కరోనా విలయతాడవం చేస్తోంది. అక్కడ కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,096 కరోనా కేసులు నమోదు కాగా 1,159 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు.

Russia Corona Cases : రష్యాలో కరోనా విశ్వరూపం.. ఒక్క రోజులోనే 1,159 మరణాలు..!
X

Russia Corona Cases : రష్యాలో కరోనా విలయతాడవం చేస్తోంది. అక్కడ కేసులు భీభత్సంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 40,096 కరోనా కేసులు నమోదు కాగా 1,159 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఇప్పటికి వరకు ఇన్ని కేసులు, ఇన్ని మరణాలు సంభవించడం మొదటిసారి. 8.3 మిలియన్లకు కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వైరస్‌‌‌ని అరికట్టడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల(నవంబర్ 7)వరకు ఎమర్జెన్సీ సేవలను తప్ప అన్ని సేవలను మూసివేశారు. రష్యాలో కరోనా కేసులు పెరగడానికి కారణం ప్రజల నిర్లక్ష్యమేనని చెప్పాలి. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. గురువారం నాటికి, రష్యా జనాభాలో కేవలం 32 శాతం మందికి మాత్రమే పూర్తిగా టీకాలు వేయబడ్డాయి.

Next Story

RELATED STORIES