Afghanistan: కాబూల్ బస్సులో పేలుడు.. ఏడుగురు మృతి

Afghanistan: కాబూల్ బస్సులో పేలుడు.. ఏడుగురు మృతి
20 మందికి పైగా గాయాలు

ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.

పేలుడు సమాచారం అందిన వెంటనే భద్రత బలగాలు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది. అక్టోబర్ నెలలో ఇదే ప్రాంతంలోని స్పోర్ట్స్ క్లబ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాల్పడ్డారు. ఆ పేలుడులో నలుగురు మరణించగా.. ఏడుగురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఓ వైపు కొద్దీ కాలం క్రితమే భూకంపం కారణంగా విధ్వంసం, మరోవైపు బాంబు పేలుళ్లతో భయానక వాతావరణం నెలకొంది.


2021లో పౌర ప్రభుత్వం నుంచి పాలనను దించేసి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తర్వాత దేశవ్యాప్తంగా మసీదులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు పెరుగుతూనే ఉన్నాయి. దేశ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఆఫ్ఘన్‌లో మైనారిటీలైన హజారా, షియా కమ్యూనిటీలను టార్గెట్ చేసుకుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. పలు సందర్భాల్లో మసీదుల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబాన్లకు తలనొప్పిగా మారారు.

ఆఫ్ఘనిస్థాన్లో 1990లో సోవియట్ సేనలపై పోరాడిన వివిధ ముజాహిద్దీన్ వర్గాలు, రష్యా నిష్క్రమణ తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వారు పాలనపై దృష్టి సారించకుండా నిరంతరం కలహాల లో మునిగి తేలుతూ ఉండేవారు. ఇక ముజాహిదీన్ నాయకుల పాలనలో ఆఫ్ఘనిస్తాన్ లో చోటుచేసుకున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలపై విపరీతంగా పన్నులు వేయడం, డబ్బుల కోసం కిడ్నాప్ లకు పాల్పడటం వంటి ఘటనలకు ముజాహిదీన్ నాయకులు పాల్పడడంతో దేశంలో అరాచకం తాండవించింది. ఇక ఈ సమయంలో 1994వ సంవత్సరంలో తాలిబన్లు ముల్లా ఉమర్ నెట్ నాయకత్వంలో దేశంలో సుస్థిరత నెలకొల్పడానికి రంగంలోకి దిగారు.

మొదట్లో ముజాహిదీన్ ఫైటర్లు ఉండే తాలిబన్ ముఠాకు తర్వాతి కాలంలో క్రమంగా పాకిస్తాన్ సైన్యం, సైనిక గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకారం పెద్దఎత్తున అందడంతో తాళి వాళ్ళు ఆఫ్ఘన్ ముజాహిదీన్ వర్గాలను ఓడించి 1998కి ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ పాలన కిందకు తెచ్చుకున్నారు. అయితే ముజాహిదీన్ నాయకుల అరాచకాలు నుండి తమకు విముక్తి లభించిందని ఆఫ్ఘన్ లకు తాలిబన్ల అరాచక పాలన సైతం వెన్నులో వణుకు పుట్టించింది. మొదటి శాంతి స్థాపన కోసం ప్రయత్నం చేస్తామని చెప్పిన తాలిబన్లు, నేరాలు, అవినీతి అరికడతామని చెప్పిన తాలిబన్లు పరిపాలనలోకి వచ్చిన తరువాత తన నిజస్వరూపాన్ని చాటుకున్నారు. నిరంకుశ పాలనకు శ్రీకారం చుట్టారు ఇస్లామిక్ పాలన పేరిట షరియా చట్టాన్ని అమలు చేశారు. ఆటవిక చట్టాలను తెచ్చి ఇప్పటికీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story