ఆమెకు 17, అతడికి 78.. పెళ్లైన 22 రోజులకే..

ఆమెకు 17, అతడికి 78.. పెళ్లైన 22 రోజులకే..
ఈ వయసులో ఇంత చక్కని చుక్కని పెళ్లి చేసుకుని

ఇద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు కూడా కాలేదు.. మీ అమ్మాయి నాకొద్దంటూ 71 ఏళ్ల నవ వరుడు 17 ఏళ్ల నోనీకి విడాకుల నోటీసు పంపించాడు. కట్నకానుకలు సరిపోలేదా.. మాకున్నంతలో భారీగానే ఇచ్చుకున్నాం కదా. బెడ్డూ, సోఫాసెట్టు ట్రక్కులో పంపించాం.. ఇంకేం కావాలి ఆయనకి అని అమ్మాయింటి వారు అబా సర్నాను ఆడిపోసుకుంటున్నారు. అయినా ముసలాడికి ఇదేం పొయ్యేకాలం ఈ వయసులో ఇంత చక్కని చుక్కని పెళ్లి చేసుకుని ఆమె జీవితాన్ని అన్యాయం చేయడానికి కాకపోతే అని చెవులు కొరుక్కున్నారు ఇండోనేషియా వాసులు.

ఇండోనేషియా జకార్తాలో చోటు చేసుకున్న ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 78 ఏళ్ల అబా సర్నా తన మనవరాలి వయస్సున్న 17 ఏళ్ల నోనీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదేమీ బలవంతపు పెళ్లో, మరొకటో కాదు.. ఇరు కుటుంబాల పెద్దలు సంప్రదించుకునే చేసుకున్నారు. వరుడికి రూ.50వేలు కట్నం కూడా ఇచ్చుకున్నారు వధువు తాలూకు బంధువులు. పెళ్లి అనంతరం కానుకల్ని వరుడు ఇంటికి మినీ వ్యాన్‌లో తరలించారు.

అంతలోనే ఏమైందో పెళ్లైన 22 రోజుల తర్వాత నవితకు విడాకుల పత్రాలు పంపించాడు అబా సర్నా. పైగా విడాకులు కోరడానికి తగిన కారణాలు కూడా చెప్పలేదు. ఈ పెళ్లి సర్నా కుటుంబసభ్యులకు ఇష్టం లేదని, పెళ్లి తర్వాత అందరూ అతడితో మాట్లాడడం మానేశారని చుట్టుపక్కల వారు నోనీ తల్లిదండ్రులకు ఉప్పందించారు. ఆ ఏడుపేదో పెళ్లికి ముందే ఏడవొచ్చుగా.. ఇప్పుడు ఒకసారి పెళ్లయిన మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అని ఆవేదన చెందుతున్నారు నోనీ అమ్మానాన్న. ఇదిలా ఉంటే పెళ్లికి ముందే నవిత గర్భవతి అని తెలిసి విడాకుల నోటీసు పంపించాడు సర్నా బంధుమిత్రులు ఆరోపిస్తున్నారు.. అయితే తన సోదరిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని నవిత సోదరి ఇయాన్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story