బ్రిటన్‌లోని ఓ గ్రామం.. బట్టలు ధరించని ప్రజలు..

బ్రిటన్‌లోని ఓ గ్రామం.. బట్టలు ధరించని ప్రజలు..
స్త్రీ పురుషులు, యువతీ యువకులు, వృద్ధులు అందరూ బట్టలు ధరించకుండా నగ్నంగా ఉంటారు.

దుస్తులు మన సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకలు. శరీరాన్ని కప్పి ఉంచే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. శతాబ్ధాలుగా దుస్తులు సమాజ సంస్కృతికి అద్ధంపడుతుంటాయి. కానీ బ్రిటన్‌లోని స్పీల్‌ప్లాట్జ్ గ్రామంలో నివసిస్తున్న స్త్రీ పురుషులు, యువతీ యువకులు, వృద్ధులు అందరూ బట్టలు ధరించకుండా నగ్నంగా ఉంటారు. ఈ గ్రామం హెర్ట్‌ఫోర్డ్‌షైర్ బికెట్‌వుడ్ సమీపంలో ఉంది. అధునాతన జీవనశైలి, ఆధునిక పోకడలు ఉట్టిపడే ఈ గ్రామంలో పబ్బులు, హోటళ్ళు, మోటల్స్, ఈత కొలనులు వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.

వేసవిలో సందర్శకులకు అద్దెకు ఇచ్చే ఇళ్ళు కూడా ఆధునిక తరహాలో రూపొందించబడ్డాయి. ఇక్కడి ప్రజలు రెండు పడకల బంగ్లాలో నివసిస్తుంటారు. భారీ క్లబ్ హౌస్‌ను కూడా ఆకర్షణీయంగా నిర్మించుకున్నారు. గ్రామాన్ని సందర్శించే పర్యాటకులు కూడా గ్రామ నియమాలను పాటిస్తూ నగ్నంగా ఉండాలి. ఇక్కడ ప్రజలు ప్రకృతిలో పూర్తిగా కలిసిపోతారు. బాగా చలిగా అనిపించినప్పుడు దుస్తులు ధరించే స్వేచ్ఛ ఇక్కడి ప్రజలకు ఉంది.

ఐసోల్ట్ రిచర్డ్సన్ అనే వ్యక్తి 1969 లో ఈ గ్రామాన్ని కనుగొన్నాడు. అతడు 1 పౌండ్‌ ధరకు ఇక్కడ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే కొనే ముందు ఈ గ్రామం గురించిన వింత ఆచారం అతడికి ఏమీ తెలియదు. బట్టలు ధరించని సంప్రదాయం ఎలా ప్రారంభమైందో గ్రామ ప్రజలకు కూడా తెలియదు. సహజ జీవితాన్ని గడపడానికి మాత్రమే వారు బట్టలు వదలిపెట్టారని చాలామంది వాదిస్తారు. చివరిగా ఒక ట్విస్ట్ ఏమిటంటే ఒక పర్యాటకుడు ఈ గ్రామాన్ని సందర్శించాలనుకుంటే అతడు పదవీవిరమణ చేసిన తరువాత మాత్రమే ఈ గ్రామంలో అడుగు పెట్టాలి.

Tags

Read MoreRead Less
Next Story