కూతురు పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేని తండ్రి ఆమె కళ్లను..

కూతురు పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేని తండ్రి ఆమె కళ్లను..
ఫలితంగా ఆమె చూపు కోల్పోవడంతో పోలీస్ ఉద్యోగం చేయలేకపోయింది.

కూతురు చదువుకోవడాన్నే ఇష్టపడని నాన్న పోలీస్ ఉద్యోగం చేస్తానంటే మాత్రం ఎందుకు ఒప్పుకుంటారు.. అందుకే దారికాచి ఆమెపై దాడి చేయమంటూ కొందరు మనుష్యుల్ని పురమాయించాడు.. ఫలితంగా ఆమె చూపు కోల్పోవడంతో పోలీస్ ఉద్యోగం చేయలేకపోయింది. కూతురు ఉద్యోగానికి వెళ్లట్లేదని తెలిసి తండ్రి కళ్లు చల్లబడ్డాయి కానీ ఆయన చేసిన పనికి కటకటాల ఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్ల్‌లోని ఒక పోలీస్ స్టేషన్లో ఉద్యోగం చేస్తున్న 33 ఏళ్ల ఆఫ్ఘన్ మహిళ ఖతేరాపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఆమెపై కాల్పులు జరిపారు. ఆమె కొన్ని నెలల క్రితం ఘజ్ని పోలీసులను తన క్రైమ్ బ్రాంచ్‌లో అధికారిగా చేరింది.

చికిత్స అనంతరం కోలుకున్న ఖతేరాకు ఏమీ కనిపించలేదు. "నేను వైద్యులను అడిగాను, నేను ఎందుకు చూడలేను అని.. గాయాల కారణంగా నా కంటి చూపు మందగించిందని వారు నాకు చెప్పారు. కానీ ఆ సమయంలో, నా ఈ పరిస్థితికి కారణం మా నాన్నే. ఆ విషయం నాకు తెలుసు అని వివరించింది.

తాలిబాన్లే ఈ దాడికి పాల్పడ్డారని అధికారులు మొదట భావించారు. కానీ ఖతర్ తాలిబన్ల ప్రమేయం లేదని వివరించింది. దుండగులు తన తండ్రి ఇచ్చిన సమాచారం మేరకే దాడి చేశారని అన్నారు. ఆయనకు నేను పోలీస్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అందుకే నాపై దాడి చేయించాడని మీడియాకు వివరించింది. సూచనల మేరకు చర్య తీసుకున్నారు, ఆమె ఇంటి

"నేను కనీసం గత సంవత్సరం పోలీసు శాఖలో జాయిన్ అయ్యానని చెప్పారు. కనీసం మరి కొన్నేళ్ల తరువాతైనా ఇలా జరిగి ఉంటే నేను బాధపడేదాన్ని కాను.. కానీ ఉద్యోగం మొదలు పెట్టి ఏడాది కూడా కాలేదు.. ఎంతో ఇష్టపడి చేస్తున్న ఉద్యోగం.. ఇప్పుడు కళ్లు లేకపోవడంతో ఉద్యోగానికి వెళ్లలేకపోతున్నాను. పోలీసు ఉద్యోగంలో జాయినై మూడు నెలలు మాత్రమే అయిందని బాధతో చెబుతోంది.

ఉద్యోగాలు చేసే మహిళలపై, ముఖ్యంగా ప్రజా పాత్రలలో పాల్గొనే వారిపై తరచూ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని మానవ హక్కుల కార్యకర్తలు అంటున్నారు. ఖతేరా విషయంలో పోలీసు అధికారి కావడం తాలిబాన్లకు కూడా కోపం తెప్పించింది. తాలిబాన్లు ప్రస్తుతం ఖతార్‌లోని దోహాలో శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నారు. దీంతో వారు అధికారికంగా తిరిగి అధికారంలోకి వస్తారని చాలా మంది ఆశిస్తున్నారు.

ఆఫ్ఘన్ మహిళల పరిస్థితి ఎప్పుడూ ప్రమాదకరమైనది అయినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇటీవల హింస పెరగడం విషయాలను మరింత దిగజార్చింది" అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ప్రచారకుడు సమీరా హమీడి అన్నారు. చిన్నతనంలో ఖతేరా కల పోలీస్ ఉద్యోగం చేయడం. తండ్రిని ఒప్పించటానికి ప్రయత్నించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. అయితే వివాహానంతరం ఆమె భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యోగంలో చేరింది.

వివాహానంతరం కూడా తండ్రి కూతురు విషయంలో కల్పించుకుని పోలీసు ఉద్యోగం మానేయమంటూ రోజూ ఖతేరాకు ఫోన్ చేసేవాడు. "చాలా సార్లు, నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు, నా తండ్రి నన్ను అనుసరిస్తున్నట్లు నేను చూశాను.. అతను సమీప ప్రాంతంలోని తాలిబాన్లను సంప్రదించడం ప్రారంభించాడు. నేను ఉద్యోగానికి వెళ్ళకుండా నిరోధించమని వారిని కోరాడు" అని ఆమె చెప్పారు.

ఖతేరా కుటుంబం, ఐదుగురు పిల్లలతో సహా ఇప్పుడు కాబూల్‌లో దాక్కున్నారు. ఇష్టపడి తెచ్చుకున్న ఉద్యోగాన్ని కోల్పోయి దుఖిస్తోంది. విదేశాలలో ఉన్న ఒక వైద్యుడు తన దృష్టిని పాక్షికంగా పునరుద్ధరించగలడని ఆమె తీవ్రంగా విశ్వసిస్తోంది.

"ఇది సాధ్యమైతే, నేను నా కంటి చూపును తిరిగి పొందుతాను, నేను నా ఉద్యోగాన్ని తిరిగి ప్రారంభిస్తాను. మళ్ళీ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో సేవ చేస్తాను" అని ఆమె చెబుతోంది.

Tags

Read MoreRead Less
Next Story