అంతర్జాతీయం

భారత్ నిజమైన ఫ్రెండ్.. విలన్‌ పాకిస్థానే: పాప్‌ సింగర్‌

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌ దుస్థితికి పాకిస్థానే కారణమని అర్యానా సయీద్‌ అన్నారు.

భారత్ నిజమైన ఫ్రెండ్.. విలన్‌ పాకిస్థానే: పాప్‌ సింగర్‌
X

Aryana Sayeed: ఆఫ్గనిస్తాన్‌‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ఆ దేశంలో పరిస్థితులు భయానకంగా మారాయి. దాంతో ఆదేశం భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. రోజు శాంతి మంత్రం జపించారు తాలిబన్లు. అలా చెప్పిన నాలుగు రోజులకే వారి అసలు రంగును బయటపెడుతున్నారు. అరాచక పాలనకు తెరతీస్తున్నారు. ఆఫ్ఘన్లపై ఆంక్షలు విధిస్తున్నారు. దేశాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకుని తాము చెప్పినట్లు నడుచుకోవాలంటున్నారు. మరో వైపు ఆఫ్గన్ మహిళలు నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాలిబాన్లపై అఫ్గాన్‌ ప్రముఖ పాప్‌ సింగర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆఫ్గనిస్తాన్‌ దుస్థితికి పాకిస్థానే కారణమని అర్యానా సయీద్‌ అన్నారు.

తాలిబన్ల మూలాలు పాకిస్థాలోనే ఉన్నాయన్నారు. తాలిబన్లను వెనుక ఉండి నడిపించడంతో పాటు నిధులు, శిక్షణ అందిస్తోందని అగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడంతో అఫ్గాన్‌ నుంచి తప్పించుకొని పారిపోయిన ఈ పాప్‌ స్టార్‌.. ఓ ఇంటర్వ్యూలో తమ దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అండగా నిలబడిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం కృషిచేయాలని కోరారు. అంతర్జాతీయ సమాజం పాక్‌కు నిధులు నిలిపివేస్తే తాలిబన్లకు సాయం అందదన్నారు.

ఈ సందర్భంగా అర్యానా మాట్లాడుతూ.. ఆఫ్గనిస్తాన్‌ పట్ల భారత్‌ చాలా స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోంది. నిజమైన మిత్రులుగా ఉండటమే కాకుండా అఫ్గాన్‌ ప్రజలకే కాదు.. శరణార్థులపట్ల కూడా ఎంతో దయతో వ్యవహరించింది. గతంలో భారత్‌లో ఉన్న అఫ్గనీలు ఎప్పుడూ ఆ దేశం గురించి, అక్కడి ప్రజల గురించి మాట్లాడుతుంటారు. అఫ్గాన్‌ ప్రజల తరఫున భారత్‌కు కృతజ్ఞతలు. పాక్‌ను నిందిస్తున్నా.

పాకిస్థానే తాలిబన్ల వెనుక ఉండి నడిపిస్తున్నది అని చెప్పేందుకు వీడియోలు, ఫొటోలు సాక్ష్యాలుగా నిలుస్తాయి. మా ప్రభుత్వం తాలిబన్లను టచ్‌ చేసిన ప్రతిసారి వారు పాకిస్థాన్‌ అండను చూపిస్తుంటారు. తాలిబన్‌ ఉగ్రవాదులకు సూచనలు, శిక్షణ పాక్‌ నుంచే అందుతాయి. అఫ్గాన్‌లో శాంతి నెలకొల్పేందుకు పరిష్కారం కనుగొనాలని కోరుతున్నా. పాక్‌పై ఒత్తిడి పెంచాలి'' అని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES