PUTIN: తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం

PUTIN: తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం
కెర్చ్‌ వంతెనపై దాడి ఘటనను సీరియస్‌గా తీసుకున్న పుతిన్‌... తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని ఉక్రెయిన్‌కు హెచ్చరిక

రష్యా ప్రధానం భూభాగంలో రెండోసారి జరిగిన దాడిపై అధ్యక్షుడు పుతిన్‌‍(Putin) తీవ్రంగా స్పందించారు. క్రిమియా ద్వీపకల్పానికి జీవనాడి లాంటి కెర్చ్‌ వంతెనపై రెండో సారి దాడి జరగడాన్ని మాస్కోధీశుడు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రిగోజిన్‌ తిరుగుబాటు ఘటన మరచిపోకముందే ఈ దాడి జరగడం రష్యన్లను భయకంపితులను చేసింది. అందుకే దీనిపై పుతిన్‌ హెచ్చరికలు చేశారు.


కెర్చ్‌ వంతెనపై జరిగిన దాడికి తప్పక ప్రతికారం తీర్చుకుంటామని("harsh" response) ఉక్రెయిన్‌(Ukrainian)ను పుతిన్‌ హెచ్చరించారు. వంతెనపై మరో తీవ్రవాద చర్య("terrorist act) చోటుచేసుకుందన్న రష్యా అధ్యక్షుడు... దీనిపై రష్యా నుంచి కచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది. తమ రక్షణ శాఖ అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని పుతిన్‌ పేర్కొన్నారు. మిలిటరీ కోణంలో చూస్తే ఇది ఒక అర్థంలేని నేరంగా ఆయన అభివర్ణించారు. ఈ వంతెనపై చాలా రోజులుగా మిలిటరీ వాహనాల రవాణా జరగడం లేదన్నారు. అయితే వంతెన వద్ద పటిష్ఠమైన భద్రత చర్యలు చేపడతామన్నారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రవాణా సదుపాయం గల ఈ వంతెన వద్ద భద్రతా ప్రమాణాలు పెంచేందుకు పలు నిర్దిష్ట ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెనపై సోమవారం వేకువ జామున 3 గంటల సమయంలో దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు చనిపోయారు. ఈ దాడి ఘటనలో ఇద్దరు దంపతులు చనిపోయారని, వారి చిన్నారికి గాయాలు అయినట్లు రష్యన్‌ అధికారులు చెప్పారు. వేకువ జామున రెండు డ్రోన్లు వంతెనపై దాడికి దిగినట్లు రష్యా పేర్కొంది. దీంతో రష్యా ఈ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసి భద్రతా చర్యలు పటిష్ఠం చేసింది. ఈ ఘటనలో క్రిమియా వంతెన రోడ్డు మార్గంలో కొంత దెబ్బతిందని రష్యా రవాణ శాఖ ప్రకటించింది.


రష్యా ఆధీనంలోని క్రిమియాను కలిపే ఈ వంతెన మాస్కోకు ఎంతో కీలకం. మొత్తం 19 కి.మీల పొడవైన ఈ వంతెన క్రిమియాకు నిత్యవసరాల సరఫరాలో, ఆయుధాల చేరవేతలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. 2014లో రష్యా రూ.29వేల కోట్లు వెచ్చించి రోడ్డు, రైలు వంతెనను నిర్మించింది. 2018లో ఇది ప్రారంభమైంది. గతంలో సైతం ఈ వంతెనపై దాడి చోటుచేసుకోవడంతో కొంత మేర దెబ్బతింది.

Tags

Read MoreRead Less
Next Story