అమెరికా ఎన్నికలపై పీఠముడి.. అయినా జోబైడెన్‌కే విజయావకాశాలు!

అమెరికా ఎన్నికలపై పీఠముడి.. అయినా జోబైడెన్‌కే విజయావకాశాలు!
అమెరికా ఎన్నికలపై పీఠముడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జోబైడెన్‌కే విజయావకాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అమెరికా..

అమెరికా ఎన్నికలపై పీఠముడి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే జోబైడెన్‌కే విజయావకాలు ఎక్కువగా ఉన్నాయి. మరో ఆరు ఎలక్టోరల్ ఓట్లు సాధిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడు. కానీ ట్రంప్‌నకు ఉన్న అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు విష్లేషకులు. అయితే ట్రంప్ మళ్లీ అధ్యక్ష స్థానంలో కూర్చోవాలంటే ఇంకా 56 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉంది. ఈ ఇద్దరి భవితవ్యాన్ని నిర్ణయించే విషయంలో నాలుగు రాష్ట్రాలు కీలకంగా మారాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వాలంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ట్రంప్‌ ముందున్న దారి ఇదొక్కటే . బైడెన్ అధ్యక్షుడిగా గెలవాలంటే ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క చోట గెలుపొందినా సరిపోతుంది. అంటే.. ట్రంప్‌తో పోల్చుకుంటే బిడెన్‌కు అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి నాలుగు దారులు ఉన్నట్టే. పెన్సెల్‌వేనియా, జార్జియా, నార్త్ కరోలినా, నెవాడా రాష్ట్రాలు అమెరికా అధ్యక్ష అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నాయి.

ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 57 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఒక్క నెవాడాలోనే బైడెన్‌ ముందంజలో ఉన్నారు. మిగతా మూడు రాష్ట్రాల్లో ట్రంప్ లీడ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఒక్క నెవాడాలో గెలిచినా బైడెన్‌కు అధ్యక్ష స్థానం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నెవాడాలో డెమొక్రట్ పార్టీ ముందంజలో ఉండటం, ఆ రాష్ట్రంలో 6 ఎలక్టోరల్ ఓట్లు ఉండటం.. బైడెన్‌ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కూడా 6 ఎలక్టోరల్ ఓట్లు మాత్రమే కావాల్సి ఉండటంతో ఆయనఅధ్యక్ష పదవిని అందుకోవడం లాంఛనమేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే.. నెవాడాలో ఇంకా 24 శాతం ఓట్లను లెక్కించాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితి తారుమారైతే సీన్ మారే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. అంటే ట్రంప్ ప్రస్తుతం లీడ్‌లో మూడు రాష్ట్రాల్లో నెగ్గడంతోపాటు..బైడెన్ లీడ్‌లో ఉన్న నెవాడాలోనూ విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ట్రంప్‌నకు కావాల్సిన మిగతా 56 ఎలక్టోరల్ ఓట్లు దక్కే ఛాన్స్ ఉంది. కానీ నెవాడాలో ట్రంప్ గెలుపొందడం దాదాపు అసాధ్యమనే అంటున్నారు. సో బైడన్ ఒక్క నెవాడలో గెలిస్తే సరిపోతుంది. కానీ ట్రంప్ మాత్రం నాలుగు రాష్ట్రాల్లోనూ గెలవాల్సి ఉంటుంది. అందుకే ట్రంప్‌తో పోలిస్తే బైడెన్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story