Top

వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ..

వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ వేశారు. ఆయనే విజేత అని దాదాపుగా తేలిపోయింది..దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది..

వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ..
X

వైట్‌హాస్ వార్‌లో బైడెన్ మరింత ముందంజ వేశారు. ఆయనే విజేత అని దాదాపుగా తేలిపోయింది..దేశ 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 538 ఓట్లున్న ఎలక్టోరల్‌ కాలేజీలో మేజిక్‌ ఫిగర్‌ 270కి చేరువగా రెండు రోజుల క్రితమే వచ్చేసిన బైడెన్ మరో రెండు స్వింగ్‌ రాష్ట్రాలు- జార్జియా, పెన్సిల్వేనియాల్లో లీడ్‌లోకి దూసుకొచ్చారు. ఆధిక్యం స్వల్పమే అయినా లెక్కింపు సరళి ఆయనకే విజయాన్ని అందించేట్లుంది. ముఖ్యంగా 20 ఎలక్టోరల్‌ ఓట్లున్న పెన్సిల్వేనియాను గనక గెలిచేస్తే పీఠం ఆయనదే. ప్రస్తుతం బైడెన్‌264, ట్రంప్ర్ 214 ఎలోక్టరల్ ఓట్లు గెలిచారు..

ఒకవేళ పెన్సిల్వేనియా గెలిస్తే బైడెన్‌ లీడ్‌ 284కు చేరుతుంది. ఇదే కాక ఆయన జార్జియాలో కూడా ఆధిక్యంలోకొచ్చారు. అయితే ఆధిక్యత కేవలం 1096 ఓట్లు మాత్రమే. ఇది సంప్రదాయకంగా రిపబ్లికన్‌ కంచుకోట. ఇది చేజారుతోందని గ్రహించిన రిపబ్లికన్లు అక్కడ రీకౌంట్‌ కోరారు. ఇద్దరి మధ్యా తేడా 0.5 శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంట్‌కు అక్కడి చట్టాలు అనుమతిస్తాయి. అదీకాక- జార్జియా గవర్నర్‌ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన వారు. ఆయన రీకౌంటింగ్‌కు అనుమతించినట్లు అధికారలు ప్రకటించారు. సైనిక దళాలతో పాటు ఇతర పోస్టల్‌ ఓట్లు రావడానికి సాయంత్రం దాకా గడువుంది. వాటిలో ఎక్కువ భాగం బైడెన్‌కే వెళ్లొచ్చని అంచనా. ఇక నెవడాలోనూ బైడెన్‌దే ఆధిక్యం. మొత్తం ఫలితాలు రావాల్సిన ఐదు రాష్ట్రాల్లో మూడింటిలో బైడెన్‌ దూసుకెళుతున్నారు. నార్త్‌ కరోలినా, అలస్కాలో మాత్రం ట్రంప్‌ ఆధిక్యం లో ఉన్నారు. అయితే ఈ రెండు చోట్ల గెలిచినా ట్రంప్ మేజిక్ ఫిగర్‌ను చేరుకోలేరు కాబట్టి..ఆయన శ్వేతసౌధాన్ని వదలిపెట్టక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయనే చెప్పొచ్చు...

వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ -ఓటమిని అంగీకరించడానికి సుముఖత చూపలేదు. శుక్రవారంనాడు తన సహాయకులు, సలహాదార్లు, పార్టీ నేతలతో సమావేశమైన ఆయన అన్ని అంశాలనూ చర్చించారు. ఓటమిని ఒప్పేసుకోవడం మంచిదని, హుందాగా ఉంటుందని కొందరు సూచించగా- మిగిలిన వారు కోర్టుల్లో గట్టిగా పోరాడదామని అభిప్రాయపడ్డారు. ఓటమిని ఒప్పుకునే ప్రసంగం ఆయన చేయకపోవచ్చని, ఆ బాధ్యతను సలహాదార్లయిన తన కుమార్తె ఇవాంకా, ఆమె భర్త జేడ్‌ కుష్నర్‌కు అప్పగించవచ్చన్న ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. మీటింగ్ తరువాత మీడియాతో మాట్లాడిన ట్రంప్‌- ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని ఆరోపించారు.

పోలింగ్‌ జరిగాక వచ్చిన ఓట్లను అనుమతించడమేంటి? ఇది చట్టవిరుద్ధం. . లీగల్‌ ఓట్లనే లెక్కించాలని డిమాండ్ చేశారు..ఎన్నికల్ని దొంగిలించడానికి డెమాక్రాట్లు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.. మీడియా అంతా వారి కి అనుకూలంగా మారిందని అన్నారు.ట్రంప్‌ మాటలు దేశప్రతిష్ఠను, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను దెబ్బతీసేట్లున్నాయని భావిస్తూ- పలు జాతీయ చానెళ్లు ఆయన ప్రసంగాన్ని మధ్యలోనే కట్‌ చేసేశాయి. ట్రంప్‌ వ్యాఖ్యలపై జో బైడెన్‌ శిబిరం తీవ్రంగా స్పందించింది. దేశంలో ప్రతీ ఓటూ పవిత్రమైనదని.. అన్నిచోట్ల కౌంటింగ్‌ పూర్తవ్వాలని అభిప్రాయపడింది. మరోవైపు.... అధ్యక్ష పీఠానికి బైడన్‌ అతి సమీపంలోకి వచ్చేయడంతో ఆయనకు భద్రతను పెంచారు. సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు రంగంలోకి దిగారు.

Next Story

RELATED STORIES