US: సంచలనం రేపిం బైడెన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో

US: సంచలనం రేపిం బైడెన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో
ఆందోళన వ్యక్తం చేసిన వైట్‌ హౌస్‌..... డీప్ ఫేక్‌ బారిన ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కూడా డీప్‌ఫేక్‌ సెగ తగిలింది. ఈ సంవత్సరం చివర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు అభ్యర్థిత్వం కోసం ప్రస్తుతం అమెరికాలో ప్రైమరీ పోల్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓటు వేయొద్ద’ని బైడెన్‌ ఓటర్లను కోరినట్లు ఉన్న ఒక నకిలీ ఆడియో వైరలైంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారంగా సృష్టించిన ఈ డీప్‌ఫేక్‌ కాల్స్‌పై వైట్‌హౌస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రముఖ గాయని టేలర్‌ స్విఫ్ట్‌పై అభ్యంతరకరంగా రూపొందించిన డీప్‌ఫేక్‌ దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టడం కలవరానికి గురిచేస్తోంది.


ఇప్పటికే సచిన్‌ ఫేక్‌ వీడియో...

ఇప్పటికే క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ డీప్‌ ఫేక్‌ వీడియో బారిన పడడం సంచలనం రేపింది. స్వయంగా సచినే ఆ వీడియాలు ఉంది తాను కానని చెప్పాల్సి వచ్చింది. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ డీప్‌ఫేక్‌ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఓ గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట్ వైరల‌్ కావడంతో అది చివరికి సచిన్‌కు చేరింది. స్కైవార్డ్‌ ఏవియేటర్‌ క్వెస్ట్‌’ పేరుతో ఉన్న గేమింగ్‌ యాప్‌నకు సచిన్‌ ప్రచారం చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఈ యాప్‌తో డబ్బులు ఎలా సంపాదించవచ్చో ఆయన చెబుతున్నట్లుగా వీడియోను మార్ఫ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో సచిన్‌ దృష్టికి రావడంతో ఆయన దీనిపై స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ గాడ్‌ స్పష్టతనిచ్చారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై ముంబయి పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబయి వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గేమింగ్ సైట్ , ఫేస్ బుక్పేజీపై కేసు పెట్టారు. "స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్" అనే గేమింగ్ యాప్ కోసం సచిన్ ప్రచారం చేసినట్లు వీడియో రూపొందించి గేమింగ్ సైట్ తోపాటు ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సచిన్, ఆయన కుమార్తె సారా గేమ్ ఆడి భారీగా ఆర్జించినట్లు కల్పిత వీడియోను సృష్టించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని సచిన్ స్వయంగా ఇటీవల వివరణ ఇచ్చారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం బాధకలిగిస్తోందని చెప్పారు. ఆ గేమింగ్ యాప్ యజమాని వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

Tags

Read MoreRead Less
Next Story