Face book love : అదిరిందమ్మా అంజూ.. కొత్త దేశం.. కొత్త ఇల్లు

Face book love : అదిరిందమ్మా అంజూ.. కొత్త దేశం.. కొత్త ఇల్లు
మతం మారినందుకు అంజుకి బహుమతుల వెల్లువ

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ప్రేమికుడి కోసం దేశం దాటి పాకిస్తాన్ వెళ్ళిపోయినా భారత మహిళ అంజు అక్కడ ఇస్లాం పుచ్చుకొని ఫాతిమాగా మారిన విషయం తెలిసిందే.. వివాహ తరువాత రిసెప్షన్ ఇచ్చిన ఆ జంటకు అక్కడి వ్యాపారవేత్త మహమ్మద్ ఖాన్ అబ్బాసీ కానుకల వర్షాన్ని కురిపించారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలంతోపాటు నగదును కూడా కానుకగా ఇచ్చారు.

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కైలోర్ గ్రామంలో జన్మించి రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసించే 34 ఏళ్ల అంజుకు, పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాతో 2019లో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అనంతరం కొద్ది రోజులకే వారి మధ్య ప్రేమ మొదలైంది. ఈ క్రమంలో ప్రియుడిని కలిసేందకు జూన్‌లో వీసా తీసుకుని పాకిస్థాన్ వెళ్లింది. తాజాగా మంగళవారం ఆమెకు నస్రుల్లాతో వివాహం జరిగినట్లు అక్కడి డీఐజీ స్థాయి అధికారే వెళ్లడించిన విషయం తెలిసిందే. వివాహానంతరం అంజు, నస్రుల్లా ఇద్దరూ కలిసి అక్కడి పార్కుల్లో కలిసి తిరిగిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


ఇప్పుడు తాజాగా ఆమె తెగువకు ముచ్చట పడిపోయిన అక్కడి వ్యాపారవేత్త పాక్ స్టార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత మహమ్మద్ ఖాన్ అబ్బాసీ ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి 272 చదరపు గజాల స్థలాన్ని, రూ.50, 000 నగదును కానుకగా ఇచ్చారు. కొత్త ప్రదేశానికి వచ్చినవారికి ఆశ్రయం ఏర్పరచుకోవడం కొంత కష్టంగానే ఉంటుంది. అందుకే నేను మా గ్రూప్ ఆఫ్ డైరెక్టర్స్ తో చర్చించి ఆమెకు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని, నగదును ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అంతే కాదు తన సహచర వ్యాపారవేత్తలు, ప్రభుత్వం కూడా వారికి చేయూతనివ్వాలని కోరారు. తమ దేశానికి కొత్తగా వచ్చిన ఫాతిమాకు పాకిస్తాన్ తన సొంత ఇల్లేనన్న భావన కల్పించాలని కోరారు.

మరోవైపు అంజు తండ్రి థామస్, తన కూతురు చేసిన పనిపై స్పందించారు. ఎంతో గొప్పదైన భారతదేశానికి అంజు వల్ల కళంకం సోకినందుకు నేను క్షమాపణలు కోరుతున్నానన్నారు. తను ఎప్పుడైతే భారత్ వదిలి పాకిస్థాన్ వెళ్లిపోయిందో..అప్పుడే ఆమెతో తమకు ఉన్న సంబంధాలు తెగిపోయాయన్నారు. అంజు తండ్రిగా ప్రభుత్వ రికార్డులో ఉన్న తన పేరును తొలగించాలని కూడా కోరారు.

Tags

Read MoreRead Less
Next Story