కాంగోలో ఘోర ప్రమాదం.. 50మంది మృతి

కాంగోలో ఘోర ప్రమాదం.. 50మంది మృతి
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కమితుగా సమీపంలోని ఓ బంగారు గని కూలిపోవడంతో సుమారు 50 మంది

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కమితుగా సమీపంలోని ఓ బంగారు గని కూలిపోవడంతో సుమారు 50 మంది దుర్మరణం చెందినట్టు తెలుస్తుంది. భారీ వర్షాల కారణంగా డెట్రాయిట్ గని సైట్‌ దగ్గర ఈ ప్రమాదం సంభవించింది. చాలామంది మైనర్లు, యువకులు షాప్ట్‌లో ఉన్నారని, గని గోడలు కూలడంతో ఎవరు బయటకు రాలేకపోయారని తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 50 మంది చనిపోయినట్టు అనుమానిస్తున్నామని.. అయితే, మృతుల సంఖ్య కచ్చితంగా తెలియదని కమితుగా మేయర్ అలెగ్జాండర్ బుండ్యా అన్నారు. కుండపోత వర్షాలు పడటంతో మూడు సొరంగాల్లోకి నీరు వెళ్లిపోయిందని దీంతో గని కూలిపోయిందని స్థానికులు మీడియాకు అధికారులు తెలిపారు. గత ఏడాది కూడా అక్టోబర్‌లో ఒక నిరుపయోగమైన బంగారు గనిలో కొండచరియలు విరిగిపడి 16 మంది మరణించగా, జూన్ 2019లో కాపర్, కోబాల్ట్ గనివద్ద మరో కొండచరియలు విరిగిపడి 43 మంది గని కార్మికులు మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story