Australia: గగనవీధిలో ప్రమాదం; రెండు హెలీకాఫ్టర్ల ఢీ...

Australia
Australia: గగనవీధిలో ప్రమాదం; రెండు హెలీకాఫ్టర్ల ఢీ...
ఆస్ట్రేలియా గగనతలంలో ఢీకొన్న రెండు హెలీకాఫ్టర్లు; చూస్తూనే గాల్లో కలసిన ప్రాణాలు

ఆస్ట్రేలియన్ టూరిస్ట్ హాట్‌స్పాట్‌లో రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోల్డ్ కోస్ట్‌లోని నార్తెన్‌ బీచ్‌లోని సీ వరల్డ్ థీమ్ పార్క్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


ఒక హెలికాప్టర్ టేకాఫ్ అవుతుండగా మరొకటి ల్యాండింగ్ అయినట్లు క్వీన్స్‌లాండ్ రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఒక హెలికాప్టర్ ఇసుక ఒడ్డుపై సురక్షితంగా ల్యాండ్ అయిందని మరో హెలికాప్టర్ శిధిలాలు చెల్లాచెదురుగా పడిపోయాయని వాటిని చేరుకోవడం కొంచెం కష్టంగా ఉందని వివరించారు. మృతిచెందినవారు, తీవ్రంగా గాయపడిన వారు ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లోని ప్రయాణీకులేనని తెలిపారు.


ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడున్న టూరిస్టులు, పోలీసులు గాయపడినవారికి ప్రథమ చికిత్స అందించారు. తలకిందులుగా పడి ఉన్న హెలికాప్టర్‌ నుంచి శిధిలాలను తొలగించడానికి ప్రయత్నించారు. సీ వరల్డ్‌ హెలికాప్టర్‌ సంస్థ మృతి చెందినవారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, దర్యాప్తు సంస్థకు అన్నివిధాల సహకరిస్తామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story