Sam Harrison: ఒకే ఓవర్‌లో ఎనిమిది సిక్సర్లు.. ఇది ఎలా సాధ్యం..?

Sam Harrison (tv5news.in)

Sam Harrison (tv5news.in)

Sam Harrison: మామూలుగా క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడమే పెద్ద రికార్డ్.

Sam Harrison: మామూలుగా క్రికెట్‌లో ఒక ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టడమే పెద్ద రికార్డ్. అందుకే ఇన్ని సంవత్సరాల క్రికెట్ హిస్టరీ ఈ రికార్డును సాధించిన ప్లేయర్స్ సంఖ్య వేళ్లపైనే లెక్కపెట్టవచ్చు. ఓవర్‌లో ఆరు ఫోర్లు కొట్టడం కూడా పెద్ద విషయమే. కానీ ఎప్పుడైనా ఓవర్‌లో ఎనిమిది సిక్సర్ల గురించి విన్నారా..? ఉన్న ఆరు బంతుల్లో ఎనిమిది సిక్సర్లు ఎలా సాధ్యం అనుకుంటున్నారా.? ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్‌కు ఇదే చేసి చూపించాడు.

అదేమీ నేషనల్ క్రికెట్ మ్యాచ్ కాదు.. కనీసం జిల్లావారీ కాంపిటీషన్ కూడా కాదు. కానీ సామ్ హారిసన్ ప్యాషన్ ఏంటో రెండు క్రికెట్ క్లబ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బయటపడింది. సామ్ హారిసన్ పెద్దగా గుర్తింపు లేని ఒక క్రికెటర్.. అప్పుడప్పుడు క్రికెట్ క్లబ్స్‌లో ఆడడం తన హాబీ. అలాగే తాజాగా రెండు సీనియర్ క్లబ్స్‌కు జరిగిన మ్యాచ్‌లో అలాగే పాల్గొన్నాడు సామ్.. కానీ అందులో తను ఆడిన ఆటకు ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచంలో ఫేమస్ ప్లేయర్ అయిపోయాడు.

ఒక ఓవర్‌లోని ఆరు బంతుల్లో సామ్ హారిసన్ ఆరు సిక్సర్లు కొట్టాడు. కానీ ట్విస్ట్ ఏంటంటే.. అందులో రెండు నో బాల్స్ అని వెల్లడించాడు ఎంపైర్. ఆ నో బాల్స్ స్థానంలో బాలర్ వేసిన మరో రెండు బంతులను కూడా బౌండరీ దాటించి అందరి చేత వావ్ అనిపించుకున్నాడు సామ్. తన ఆట చూసిన తర్వాత ఇలాంటి గుర్తింపు లేని టాలెంటెడ్ ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారంటూ సామ్ హారిసన్‌ను ఒక రేంజ్‌లో పొగిడేస్తున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story