Mauritius: మారిషస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం..

Mauritius: మారిషస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం..
హిందువులకు రెండు గంటలు ప్రత్యేక సెలవు

రామయ్య జన్మ భూమి అయోధ్యలో శ్రీ రామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన అంగ రంగవైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఆలయంతో పాటు నగరాన్ని కూడా అతి సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సమక్షంలో ఇతర నేతల సమక్షంలో రామమందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆహ్వానించారు. పలువురు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రిటీలను దీక్షా కార్యక్రమంలో పాల్గొనమంటూ ఆహ్వానం అందించారు. ఆలయ ప్రారంభం కోసం దేశ విదేశాల్లో ఉన్న రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మారిషస్ ప్రభుత్వం రామ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది.

రామ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని దేశ విదేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మారిషస్ ప్రభుత్వం అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మారిషస్‌ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 22న ఆ దేశంలో నిర్వహిస్తున్న పూజల్లో పాల్గొనేందుకు, అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకను టీవీల్లో చూసేందుకు హిందు అధికారులకు రెండు గంటల పాటు అనుమతి మంజూరు చేసింది. హిందూ సంఘాలు చేసిన విజ్ఞప్తిపై అక్కడి ప్రధాని అనిరుధ్‌ జగన్నాధ్‌ నేతృత్వంలోని కేబినెట్‌ చర్చించి రెండు గంటల ప్రత్యేక సెలవుకు అనుమతి ఇచ్చింది. మారిషస్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువుల జనాభా 48.5 శాతంగా ఉంది.

మారిషస్‌లోని సనాతన్‌ ధర్మ దేవాలయాల సమాఖ్య విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని అక్కడి ప్రధానమంత్రి ప్రవింద్‌ జుగ్‌నాథ్‌ ఆధ్వర్యంలో మంత్రిమండలి ఈ నిర్ణయం తీసుకుంది. రామ మందిరం ప్రారంభోత్సవాన్ని సాంస్కృతిక ప్రాముఖ్యతగా గుర్తించింది. ఈ వేడుకను అక్కడి భక్తులు ప్రత్యక్షప్రసారం వీక్షించేలా నిర్ణయం తీసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మారిషస్‌లో దాదాపు 48.5 శాతం హిందువుల జనాభా ఉంది. ఆఫ్రికాలో హిందూమతం ఎక్కువగా ఆచరించే దేశాల్లో మారిషస్‌ మొదటిస్థానంలో ఉంది. భారత్‌లోని యూపీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఎక్కువ సంఖ్యలో మారిషస్‌లో ఉన్నారు.

అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఉన్న భారతీయులకు రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూడాలనే ఉత్సాహం ఉంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రసారం చేయనున్నామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story