హీట్‌వేవ్‌తో పోరాడుతున్న బంగ్లాదేశ్ ప్రజలు

హీట్‌వేవ్‌తో పోరాడుతున్న బంగ్లాదేశ్ ప్రజలు
దక్షిణాసియా లో బంగ్లాదేశ్ ఈ అర్థ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న దేశం గా నిలిచింది.

దక్షిణాసియాలో ఈ అర్థ శతాబ్దంలో అత్యంత సుదీర్ఘమైన హీట్‌వేవ్‌తో పోరాడుతున్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆ దేశంలో చాల వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. ఇది ఇలా ఉండగా మరోవైపు అక్కడి ప్రజలను విద్యుత్ కోతలు మరింత కష్టాలకు గురి చేస్తున్నాయి. బాంగ్లాదేశ్ రాజధాని నగరం అయిన ఢాకాలో ఇప్పటికి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ (104 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉన్నాయి.

1971లో బంగ్లాదేశ్‌కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంత తీవ్రమైన వేడి గాలులు చూడలేదని అక్కడి వాతావరణ శాఖ సీనియర్ అధికారి బజ్లూర్ రషీద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పదివేల ప్రయిమరీ స్కూల్స్ ని మూసివేసింది. ఎండ వేడిమి కారణంగా ఎయిర్ కండీషనర్లు, ఫ్యాన్‌లకు చాలా డిమాండ్ పెరిగింది. దీనికి తోడు బొగ్గును కొనుగోలు చేయలేక పోవడంతో బంగ్లాదేశ్లోని అతిపెద్ద పవర్ ప్లాంట్ పనులను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది.

Tags

Read MoreRead Less
Next Story