Bangladesh Debt: నెలకు 960 మిలియన్ డాలర్లు బకాయి పడ్డ బంగ్లాదేశ్

Bangladesh Debt: నెలకు 960 మిలియన్ డాలర్లు బకాయి పడ్డ బంగ్లాదేశ్

Bangladesh: తీవ్ర ఆర్థిక కష్టాల్లో పొరుగునే ఉన్న బంగ్లాదేశ్ ఆయిల్ కంపెనీలకు భారీ మొత్తంలో బాకీ పడింది. దీంతో దేశంలోకి నిరంతర గ్యాస్ సరఫరా కోసం వచ్చే నెల నుంచి వివిధ సంస్థలకు సుమారుగా 960 మిలియన్ డాలర్ల భారీ మొత్తం చెల్లించనుంది. వీటిలో LNG సరఫరాదారులు, అంతర్జాతీయ ఆయిల్ కంపెనీ(IOC)లు, ఇతర స్థానిక, విదేశీ కంపెనీలకు ఈ చెల్లింపులు చేయనున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టారు. 2024 జనవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అనివార్యమైందని భావిస్తున్నారు.

ప్రతి వారం చెల్లించే మొత్తంలో, పవర్ ప్లాంట్ యజమానుల రుణాన్ని తీర్చడానికి విద్యుత్, ఇంధనం మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ (MPEMR) కింద విద్యుత్ విభాగానికి $160 మిలియన్లు వెళ్లనున్నాయి. $80 మిలియన్లు ఇంధన, ఖనిజ వనరుల విభాగానికి (EMRD) LNG సరఫరాదారులు మరియు IOCలకు చెల్లింపుల కోసం కేటాయించారు.

అంతరాయం లేని సహజ వాయువు సరఫరా కోసం, LNG సరఫరాదారులు, IOC లకు రుణాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ నిర్వహణలోని పెట్రో బంగ్లా ఛైర్మన్ జానేంద్ర నాథ్ సర్కర్ ప్రభుత్వానికి వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి నిరంతర విద్యుత్ సరఫరా కోసం MPEMRలోని పవర్ డివిజన్ దాదాపు $5.921 బిలియన్లు కేటాయించాలని కోరింది.

ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్ 2024 జనవరిలో జరగనున్న తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ముందు అంతరాయాలను నివారించడానికి ప్రపంచ రుణదాతల మద్దతుతో ఇంధన బిల్లులను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెట్రోబంగ్లా ఇస్లామిక్ ట్రేడ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి సుమారు $500 మిలియన్లు రుణం తీసుకోవడానికి చర్చలు జరుపుతోంది. ఈ సంవత్సరం జూన్ నాటికి, ప్రభుత్వం ప్రైవేట్, ఇతర స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తిదారులకు సుమారు $2.4 బిలియన్లు, భారతదేశం నుండి చేసుకున్న విద్యుత్ దిగుమతుల కోసం $475 మిలియన్లు, గ్యాస్ కంపెనీలకు $350 మిలియన్లు, LNG సరఫరాదారులకు $320 మిలియన్లు బకాయిపడింది.

దీంతో పాటుగా దేశంలో విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు బంగ్లాదేశ్ చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఇటీవలే దేశంలో మొట్టమొదటి బ్రెంట్ క్రూడ్-లింక్డ్ మోడల్ ప్రొడక్షన్ షేరింగ్ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. గతంలో డీప్‌వాటర్ అన్వేషణ ప్రయత్నాల్లో ఎదురుదెబ్బలను తిన్న బంగ్లా పవర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికే కట్టుబడి ఉంది.







Tags

Read MoreRead Less
Next Story