BBC Family: నాన్న ఇంటర్వ్యూలో అల్లరి చేసిన చిచ్చర పిడుగులు వీరే...

BBC Family: నాన్న ఇంటర్వ్యూలో అల్లరి చేసిన చిచ్చర పిడుగులు వీరే...
బీబీసీలో తండ్రి ఇంటర్వ్యూలోకి దూసుకొచ్చిన చిన్నారులు; అంతే వేగంతో వారిని లాక్కెళ్లిన తల్లి; వైరల్ అయిన వీడియో...

ఆన్ లైన్ మాధ్యమం ద్వారా సీరియస్ గా బీబీసీ ఇంటర్వ్యూలో పాలుపంచుకుంటోన్న తండ్రి, అకస్మాత్తుగా అతడి ఆఫీస్ రూమ్ లోకి దూసుకువచ్చిన తనయ, ఆమె వెనుకే బుడిబుడి అడుగులు వేసుకుంటూ వాకర్ లో రైయ్యి మంటూ వచ్చేసిన మరో బుజ్జాయి. ఇక వీరిద్దరనీ లాక్కెళ్లెందుకు మెరుపువేగంతో దూసుకువచ్చిన తల్లి వారిద్దరినీ లాక్కెళ్లిన వైనం అందరినీ అప్పట్లో ఇంటర్నెట్ ను ఓ ఊపుఊపేసింది. 2017లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పటికీ నెటిజెన్లను అలరిస్తూనే ఉంది. అయితే ఆ చిచ్చర పిడుగులు ఇప్పుడు ఎంత పెద్దవారయ్యారో చూసి అంతే మురిసిపోతున్నారు.

దక్షిణ కొరియాలోని పుసాన్ జాతీయ విశ్వవిద్యాలంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాబర్ట్ కెల్లీ కుటుంబం ఇప్పటికీ నెటిజెన్ల హాట్ ఫేవరేట్ అనే చెప్పాలి. ఇక ఈ వీడియో వైరల్ అయ్యి ఇప్పటికి ఆరేళ్లు పూర్తి అవ్వడంతో రాబర్ట్ సోషల్ మీడియో షేర్ చేసిన ఫ్యామిలీ పిక్చర్స్ మరోసారి వైరల్ గా మారాయి. అప్పట్లో పసికందులైన ఆ చిచ్చర పిడుగులు ఇప్పుడు ఇంత పెద్దవారయ్యారు. పదేళ్ల మారియన్, ఆరేళ్ల జేమ్స్ ను చూసి ఎవరికైనా మురిపెం పెరగాల్సిందే మరి.

Tags

Read MoreRead Less
Next Story