Bed Bugs: పారిస్ వాసులను కుట్టి కుట్టి చంపేస్తున్నాయి..

Bed Bugs: పారిస్ వాసులను కుట్టి కుట్టి చంపేస్తున్నాయి..
పారిస్‌పై నల్లుల దండయాత్ర...

పర్యాటక స్వర్గధామం, వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు వేదికైన ఫ్రాన్స్‌ను నల్లుల బెడద వేధిస్తోంది. కొద్ది వారాలుగా వాటి సంఖ్య విపరీతంగా పెరిగింది. పారిస్‌, మర్సేలీతో పాటు దాదాపు అన్ని సిటీల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కానీ...పారిస్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా కనిపిస్తోంది. సినిమాహాళ్లు, హోటళ్లు, బస్సులు, రైళ్లు, సబ్‌వేలు ఇలా ఎక్కడ చూసినా నల్లులే దర్శనమిస్తున్నాయి. ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఈ నల్లుల నివారణకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024లో ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్‌ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నల్లుల బెడదతో పర్యాటక స్వర్గధామం సతమతమవుతోంది. ఎక్కడిక్కడ కనపడుతున్న నల్లులు ప్రజల రక్తాన్ని పీల్చుతున్నాయి. కొందరిలో తీవ్రమైన అలర్జీలకు కారణమవుతున్నాయి. నల్లులకు సంబంధించిన భయానక వీడియోలు, కథనాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సినిమా హాళ్లకు ప్రజలు రావడం తగ్గిపోతుండటంపై యజమానులు ఆందోళన చెందుతున్నారు. థియేటర్లలోని కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది.


నల్లుల విషయంలో నగరంలో ఎవరూ సురక్షితంగా లేరని పారిస్‌ ఉపమేయర్‌ పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వచ్చే ఏడాది ఒలింపిక్‌ క్రీడల నిర్వహణకు పారిస్‌ సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. ఈ పరిణామాలపై ఫ్రాన్స్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. నల్లుల నివారణకు తగు చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా ఇచ్చింది.

రోజూ 36 లక్షల మంది ప్రజలు పారిస్‌కు రాకపోకలు సాగిస్తున్నారని, ఈ క్రమంలోనే నల్లుల ఉద్ధృతి పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి మూడేళ్ల క్రితమే ఫ్రాన్స్‌ ప్రభుత్వం నల్లులపై యుద్ధాన్ని ప్రకటించింది. నల్లులు పారిస్ ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే నల్లుల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఫ్రాన్స్‌ ప్రధాని ఎలిసబెత్‌ బోర్న్‌ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. రవాణా మంత్రి క్లెమెంట్ బౌన్ రవాణా సంస్థలతో సమావేశమయ్యారు, తనిఖీలు, క్రిమిసంహారక కోసం ఒక ప్రణాళికను రూపొందించారు. 2017 నుంచి 2022 మధ్యలో ఫ్రాన్స్‌లోని ప్రతి 10 ఇళ్లలో ఒక ఇళ్లు నల్లుల బారినపడింది. నల్లుల సంఖ్య పెరగడానికి గ్లోబర్‌ వార్మింగే కారణమని ఫ్రాన్స్‌ ప్రభుత్వం చెబుతోంది.



వచ్చే ఏడాది ఫ్రాన్స్‌లో ఒలింపిక్స్ క్రీడల సమయంలో ఆరోగ్యం, భద్రత తదితర అంశాలపై ఈ నల్లుల బెడద పలు ప్రశ్నల్ని లేవనెత్తుతోంది. ఫ్రాన్స్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలో ఈ అంశం గురించి విస్తృత చర్చ జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, డీడీటీ అనే క్రిమిసంహారక మందులను విపరీతంగా వాడటం వల్ల నల్లుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కానీ, తర్వాత డీడీటీతో పాటు, ఇతర రసాయనాలు మానవులపై చూపే ప్రభావాల కారణంగా వాటిని నిషేధించారు.

Tags

Read MoreRead Less
Next Story