వలసల విధానాలపై కీలక నిర్ణయం తీసుకున్న బైడెన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై తీసుకున్న పలు నిర్ణయాలను బైడెన్ మార్చేస్తున్నారు.

X
Vamshi Krishna3 Feb 2021 4:15 PM GMT
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలపై తీసుకున్న పలు నిర్ణయాలను బైడెన్ మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా సరిహద్దుల వద్ద పిల్లలను దూరం చేసుకున్న కుటుంబాలను తిరిగి ఒక్కటి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక సరిహద్దుల నుంచి వలస వచ్చేవారికి ఆశ్రయం కల్పించేలా వలసల నిరోధక చర్యలు నిలిపేయనున్నారు. అంతేకాకుండా ఇతర వలస విధానాలను సమీక్షిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ హయాంలో తమ పిల్లలను దూరం చేసుకున్న దాదాపు 5500 కుటుంబాలకు వారి పిల్లలను చేరువచేసే దిశలో ప్రత్యేక కార్యదళం పనిచేయనుంది.
Next Story