ఐదు సంవత్సరాల క్రితమే తాను.. : బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు

ఐదు సంవత్సరాల క్రితమే తాను.. : బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు
ఇది నిజంగా బాధాకరం. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలలు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది.

మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ కరోనా విలయంపై ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలలు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోందని హెచ్చరించారు. ఆదివారం రోజు ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేట్స్ మాట్లాడారు. ఇది నిజంగా బాధాకరం. రాబోయే నాలుగు నుంచి ఆరు నెలలు పరిస్థితి మరింత దారుణంగా ఉండబోతోంది. అమెరికాలో మరో 2 లక్షల కరోనా మరణాలు నమోదవుతాయని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను పాటించినట్లైతే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు.

ఐదు సంవత్సరాల క్రితమే తాను.. ప్రపంచం ఏదో విపత్తును ఎదుర్కోబోతుందని హెచ్చరించానని గుర్తు చేశారు. 2015 లో భవిష్య సూచనలు చేసినప్పుడు, మరణాలు ఎక్కువగా ఉండవచ్చని నేను మాట్లాడాను. ఐదేళ్ల క్రితం నేను చేసిన అంచనాల కంటే యుఎస్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చాలా ఎక్కువగా ఉంది "అని ఆయన అన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంత భారీ స్థాయిలో సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని తాను ఊహించలేదన్నారు. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య కోటీ 60 లక్షలకు చేరువైంది. దాదాపు 2.90 లక్షల మందిని మహమ్మారి పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో ఐహెచ్ఎంకు సంచలన విషయాలు వెల్లడించింది. ఏప్రిల్ నాటికి అమెరికాలో కరోనా మరణాల సంఖ్య ఐదు లక్షల మార్క్ దాటుతుందని అంచనా వేసింది. కాగా.. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున వ్యాక్సిన్ కోసం బిల్ గేట్స్ భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story