బ్లూమ్ బర్గ్ టాప్ 10 బిలియనీర్స్ వీళ్లే..

బ్లూమ్ బర్గ్ టాప్ 10 బిలియనీర్స్ వీళ్లే..

బ్లూమ్ బర్గ్ టాప్ టెన్ బిలియనీర్స్ లిస్టు విడుదల చేసింది. జనవరిలో 35వ స్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ ఏకంగా నెంబర్ 2 పోజిషన్ కు వచ్చేశారు. నెంబర్ 1 స్థానంలో అమోజాన్ అధినేత జాఫ్ బోజెస్ కొనసాగుతున్నారు. ఆయన ఆస్థి 183 బిలియన్ డాలర్లు. ఈ సంవత్సరం ఏకంగా ఆయన ఆస్తి 68.1బిలియన్ డాలర్లు పెరిగింది.

నెంబర్ 2లో ఎలాన్ మస్క్ ఉన్నారు. టెస్లా, స్పెస్ ఎక్స్ కంపెనీల అధినేత మస్క్ జనవరిలో 35వస్థానంలో ఉన్నాడు. అనూహ్యంగా ఈ ఏడాదిలోనే ఆయన ఆస్థి 108 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ 136 బిలియన్ డాలర్లు.

నెంబర్ 3లో బిల్ గేట్స్ ఉన్నారు. ఆయన సంపద 129 బిలియన్ డాలర్లు కాగా.. ఈ ఏడాది పెరిగింది స్వల్నమే కేవలం 15.8బిలియన్ డాలర్లుమాత్రమే.

నెంబర్ 4 లో ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు. ఆయన సంపద ప్రస్తుతం 105 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది 26.5బిలియన్ డాలర్ల సంపద పెరిగింది.

నెంబర్ 5. బెర్నాల్డ్ అర్నాల్డ్ LVMH అధినేత అయిన బెర్నాల్స్ ఆస్తి 105 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది కేవలం 647 మిలియన్లు మాత్రమే పెరిగింది. ఫ్యాషన్ రంగంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.

నెంబర్ 6లో ఇన్వెస్టర్ మరియు హాథ్ వే అధినేత వారెన్ బఫెట్ ఉన్నారు. ఆయన నెట్ వర్త్ 88.4 బిలియన్ డాలర్లు. ఆయన సంపద తగ్గుతూ వచ్చింది. 883 మిలియన్ డాలర్లు తగ్గినట్టు తెలుస్తోంది.

నెంబర్ 7లో లారీ పేజ్ ఉన్నారు. గూగుల్ అధినేతల్లో ఒకరు.ఆయన సంపద ఈ ఏడాది 18.1 బిలియన్ పెరిగి.. 82.7 బిలియన్ డాలర్లకు చేరింది.

నెంబర్ 8లో గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రెయిన్ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 17.4 బిలియన్లు పెరిగి.. 80.1బిలియన్ డాలర్లకు చేరింది.

నెంబర్ 9లో స్టీవ్ బాల్మర్ ఉన్నారు. ఆయన సంపద ఈ ఏడాది 19.2బిలియన్లు పెరిగింది. ప్రస్తుతం నెటవర్త్ 77.4 బిలియన్ డాలర్లు.

నెంబర్ లో10లో మన దేశానికి చెందిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఉన్నారు. జనవరి తర్వాత ఆయన ఆస్తి 16.2 బిలియన్ డాలర్లు పెరిగి.. మొత్తం సంపద 74.9 బిలియన్లకు చేరింది.

Also Read:profit your trade


Tags

Read MoreRead Less
Next Story