స్కూలు విద్యార్థి అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని 'కిమ్' సర్కారు అతడిని..

స్కూలు విద్యార్థి అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని కిమ్ సర్కారు అతడిని..
ఉత్తర కొరియా పోలీసులు తన ఇంట్లో పోర్న్ మూవీ చూస్తున్న బాలుడిని ట్రాక్ చేశారు.

పోర్న్ "సమాజాన్ని నాశనం చేస్తుంది" అని నమ్ముతున్న ఉత్తర కొరియా సుప్రీం నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల ఓ పాఠశాల విద్యార్థి తన ఇంట్లో అశ్లీల చిత్రాలు చూస్తూ పట్టుబడ్డాడు. ఆ టీనేజ్ కుర్రాడికి కిమ్ కఠినమైన శిక్ష విధించాడు.

దక్షిణ కొరియాకు చెందిన డైలీ ఎన్‌కె వార్తాకథనం ప్రకారం , ఉత్తర కొరియా పోలీసులు తన ఇంట్లో పోర్న్ మూవీ చూస్తున్న బాలుడిని ట్రాక్ చేశారు. దేశవ్యాప్తంగా ఉత్తర కొరియా ప్రభుత్వం అశ్లీల చిత్రాలు చూస్తున్నారని తెలిస్తే చాలు. వారిని కఠినంగా శిక్షిస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు అశ్లీల చిత్రాలు చూస్తూ విద్యార్థి పట్టుబడ్డాడు.

పోలీసులు ఐపి చిరునామాను ట్రాక్ చేసి, పోర్న్ చూడడంలో బిజీగా ఉన్న యువకుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకుగాను అతడికి కఠిన శిక్ష విధిస్తూ బాలుడుని అతని కుటుంబ సభ్యులను సమాజం నుండి బహిష్కరించి సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళ్లారు.

అంతేకాకుండా పిల్లవాడు చదివిన పాఠశాల ప్రిన్సిపాల్‌ను కూడా ఉత్తర కొరియా చట్టాల ప్రకారం శిక్షగా కార్మిక శిబిరానికి పంపారు. ఈ దేశంలో చట్టాలు చాలా కఠినంగా అమలు చేయబడతాయి. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఏడాది పొడవునా లాక్డౌన్ విధించి ఉత్తర కొరియా వార్తల్లో నిలిచింది.

ప్రస్తుతం ఉత్తర కొరియాలో అధికారంలో ఉన్న వర్కర్స్ పార్టీ పాఠశాలల్లో అశ్లీలతకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story