Top

గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిన బాలుడు.. వీడియో వైరల్

గాలిపటాన్ని పట్టుకున్న బాలుడు ఒక్కసారిగా గాల్లోకి లేచాడు. చుట్టూ జనం చూస్తూనే ఉన్నారు. అయినా వారికి ఒక్క క్షణం ఏం

గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిన బాలుడు.. వీడియో వైరల్
X

గాలి పటాలు ఒక్కోసారి ప్రాణాలు తీసే మృత్య శకటాలుగా మారుతుంటాయి. తాజాగా జరిగిన ఓ సంఘటనలో అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.. ఇండోనేషియాకు చెందిన 12 ఏళ్ల బాలుడు డిసెంబర్ 1న తన స్కూలు విద్యార్థులతో కలిసి గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఇంతలో గాల్లోకి ఎగురుతున్న గాలిపటాన్ని పట్టుకున్న బాలుడు ఒక్కసారిగా గాల్లోకి లేచాడు. చుట్టూ జనం చూస్తూనే ఉన్నారు. అయినా వారికి ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

అంతలోనే ఆ బాలుడు 30 అడుగుల ఎత్తుకి చేరుకుని దబ్బున కింద పడ్డాడు.. జరిగింది పొలాల్లో కాబట్టి సరిపోయింది. చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. అదే ఏ మేడ మీదో ఎగరేసినట్లైతే దెబ్బలు బలంగా తగిలేవి.. పిల్లవాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. స్పృహతప్పి పడిపోయిన ఆ బాలుడిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆ బాలుడికి అత్యవసర చికిత్స జరిపి ప్రమాదం లేదని తేల్చి చెప్పారు. గాలిపటాన్ని ఎగురవేస్తున్న తన సోదరుడికి సాయం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా గాల్లోకి లేవడంతో బాలుడు కూడా దాంతో పాటు పైకి వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాలుడు తేలిగ్గా ఉండడంతో గాలిపటంతో పాటు పైకి ఎగిరాడని, పట్టుతప్పడంతో కింద పడ్డాడని వివరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

RELATED STORIES