Variety marriage : పెళ్ళంటేనే రిస్క్.. మళ్ళీ ఈ రిస్క్ ఏంటో

Variety marriage : పెళ్ళంటేనే రిస్క్.. మళ్ళీ ఈ రిస్క్ ఏంటో
స్కై డైవింగ్ చేస్తూ పెళ్లి చేసుకున్న జంట

పెళ్లంటే అందమైన, ఖరీదైన బట్టలు, వెరైటీ ఆలోచనలతో అందరి దృష్టిని ఆకర్షించేలా వేడుక చేసుకోవటం ఇప్పటి ట్రెండ్..కానీ కొందరు వినూత్నంగా ఆలోచించి వివాహం చేసుకోవటం ద్వారా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటారు. అదే విదేశాల్లో అయితే, రిస్క్ చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అంటేనే రిస్క్ అని కాదు వీళ్ళు ఉద్దేశం. ఏదో కొత్తగా చెయ్యాలి అన్న తపన వీరిది.

తాజాగా ఓ జంట తమ వివాహాన్ని జీవితాంతం గుర్తుండి పోయేలా జరుపుకోవాలని నిర్ణయించింది. ఆ మేరకు ఎత్తైన కొండలపై నుంచి స్కైడైవింగ్ చేస్తూ పెళ్లి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వధూవరులు ఇద్దరు ఇన్స్పెక్టర్ల సహాయంతో ఎత్తయిన కొండమీద నుండి దూకారు. ఆ తరువాత పారాచూట్ లు ఓపెన్ అవ్వడంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. అత్యంత భయంకరమైన కొండలపై నుంచి స్కైడైవింగ్ ద్వారా జరిగిన ఈ వివాహానికి హాజరైన స్నేహితుల బంధువులు తమ చప్పట్లతో వధూవరులను ఆశీర్వదించారు.

ఈ వీడియోను లలిబ్రేటమోరద అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. తన స్నేహితులు ప్రిస్సిల్లా, ఫిలిప్పోల వివాహ జీవితం ను ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నానని విష్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెట్టిజెల్లు ఒక్కొక్కరు. ఒక్కో రకంగా స్పందిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story