California: పిల్లలపై లైంగిక వేధింపులు.... 690 ఏళ్ల పాటు జైలు శిక్ష
అమెరికాలోని ఓ యువకుడికి భారీ శిక్షపడే ఉంది. కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన 34 ఏళ్ల మాథ్యూ జాక్‌జివిస్కీకి సుమారు 690 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఆటను చేసిన నేరం ఏంటంటే ఓ డే కేర్ సెంటర్‌లో 16 మంది అబ్బాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ కేసుల్లో అతను దోషిగా తేలాడు. 16 మంది అబ్బాయిలను లైంగికంగా వేధించడంతో పాటు ఓ కుర్రాడికి పోర్న్ వీడియోలు చూపించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఆరెంజ్ కౌంటీ జిల్లా అటార్నీ తీర్పును వెలువరించారు.
వివరాలలోకి వెళ్తే దక్షిణ కాలిఫోర్నియాలో మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ అనే వ్యక్తిని ఆయా గా చేసేవాడు. చాల మంది తల్లిదండ్రులు తమ పిల్లలని చూసుకునేందుకు మాథ్యూ జక్ర్‌జెవ్‌స్కీ ని నియమించుకున్నారు. వారంతా తమ పిల్లను ఓ సంరక్షకుని నీడలో పెంచుతున్నాం అనుకున్నారు తల్లిదండ్రులు. కానీ ఓ రాక్షసుడి చేతిలో పిల్లలని పెడుతున్నాం అని తెలుసుకోలేక పోయారు. తల్లిదండ్రులు అతన్ని పూర్తిగా విశ్వసించారు. కానీ ఇదే అదునుగా అతను మైనర్ అబ్బాయిలని వేధించడం ప్రారంభించారు 16 సంవత్సరాలు మరియు అంతకంటే తక్కువ వయసున్న అబ్బాయిలకి అస్లీల వీడియోలు చూపించడం, వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం చేశారు. పిల్లలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకి చెప్పగా.. తల్లిదండ్రులు అతని పైన కేసుపెట్టారు. ఈ కేసులో ఆ ఆయాని నిందితుడుగా నిర్ధారించారు.
ఈ నేపథ్యంలో అతనికి 690 ఏళ్ల యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. కాగా మొత్తం 34 కేసుల్లో అతను నిందితుడుగా ఉన్నాడు. వాటి అన్నింటిలో అతన్ని దోషిగా తేల్చారు. తన లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు మగ పిల్లల్ని తీవ్రంగా వేధించినట్లు మాథ్యూపై ఆరోపణలు ఉన్నాయి. 2014 జనవరి ఒకటో తేదీ నుంచి 2019 మే 17వ తేదీ మధ్య కాలంలో అతని ఈ అకృత్యాలకు పాల్పడ్డాడు. కేసులకు సంబంధించి 2023, నవంబర్ 17వ తేదీన జైలు శిక్షా కాలాన్ని కోర్టు వెల్లడించనున్నది. అన్ని కేసులు కలిపితే అతనికి సుమారు 690 ఏళ్ల జైలుశిక్ష పడే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com