Pakistan love story: ఆ ప్రేమికురాలి కోసం ఉగ్ర దాడి?

Pakistan love story: ఆ ప్రేమికురాలి కోసం ఉగ్ర దాడి?
సీమాహైదర్ ప్రేమ కథలో ముంబయి పోలీసులకు మరో హెచ్చరిక

పాకిస్థానీ మహిళ సీమా హైదర్, సచిన్ మీనాల ప్రేమ కధలో సినిమా ట్విస్టుల కంటే గొప్ప మలుపులు తిరుగుతోంది. అసలు ఈ పబ్జి లవ్ స్టోరీనే ఒక వింత అంటే ఇప్పుడు అందులో ఉగ్రవాదం ఎంటర్ అయ్యింది. తాజాగా ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు హెచ్చరిక జారీ చేశారు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో 26/11 తరహా ఉగ్రదాడి చేస్తామంటూ ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెదిరింపు ఫోన్ కాల్ చేసాడు.

సీమా హైదర్..గతవారం రోజులుగా వార్తలో నిలుస్తున్న పేరు. పబ్‌జీ గేమ్‌ ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు భర్తను వదిలి నలుగురు పిల్లల్ని తీసుకొని నేపాల్ మీదుగా భారతదేశానికి వచ్చింది. సరిహద్దులు దాటిన వీరి ప్రేమకథ నేడు పోలీసులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త గులాం హైదర్ తన భార్య, పిల్లలను తమ దేశానికి పంపించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఓ వీడియో సందేశాన్ని పంపాడు. మరోవైపు ప్రేమికుడి కోసం పాకిస్తాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమా హైదర్‌ను తిరిగి పంపించాలని, లేదంటే హిందువుల ఆధ్యాత్మిక ప్రాంతాలు, నివాసాలపై దాడులు చేస్తామంటూ సింధ్ ప్రావిన్స్‌లోని బందిపోట్లు బెదిరించారు.


ఇక ఇక్కడ ఓ ఆగంతకుడు ముంబయి పోలీసులకు ఫోన్ చేసాడు. సీమా హైదర్ పాకిస్థాన్ దేశానికి తిరిగి రాకపోతే ముంబయిలో తరహా ఉగ్రదాడి చేస్తామని ముంబయి ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. హెచ్ఛరికపై ముంబయి పోలీసులు క్రైమ్ బ్రాంచ్ తో కలిసి విచారణ ముమ్మరం చేశారు.ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌కు తరచూ ఇలాంటి కాల్స్ వస్తున్నప్పటికీ, పోలీసులు ఇప్పుడు ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు.

సీమా హైదర్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జైస్మాబాద్ నివాసి. ఆమెకు 2014లో గులాం రజా అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి నలుగురు పిల్లలు. 2019లో గులాం రజా పని నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. తరువాత మనస్పర్థలతో సీమ పుట్టింటిలోనే ఉండిపోయింది. టుంది. ఈ క్రమంలో 2020లో గ్రేటర్ నోయిడాలోని జెవార్ నివాసి అయిన సచిన్‌తో సీమా PUBG గేమ్ ద్వారా పరిచయం ఏర్పడింది.

వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఇద్దరూ నేపాల్‌లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ మే 12న నేపాల్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి సచిన్ ఇంటికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో అక్రమంగా సరిహద్దు దాటిన నేరం కింద సీమా హైదర్, సచిన్‌ లను నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.


అయితే బెయిల్ పై బయటకు వచ్చిన సీమా మాత్రం తనని పాకిస్థాన్‌కు పంపవద్దనీ, పంపితే ప్రాణహాని ఉందని వేడుకుంటోంది. తనను భారత్‌లో ఉండేందుకు అనుమతించాలని యోగి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తన ఇష్టపూర్వకంగానే హిందూ మతాన్ని స్వీకరించి సచిన్‌ను పెళ్లి చేసుకున్నట్లు సీమా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story