Justin Trudeau : మరోసారి మొరాయించిన ట్రూడో అధికారిక విమానం.

Justin Trudeau : మరోసారి మొరాయించిన ట్రూడో అధికారిక విమానం.
జీ20 తర్వాత రెండోసారి

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఇటీవలి తన కరీబియన్ పర్యటనలో ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఆయన పర్యటించిన విమానంలో సాంకేతికలోపం తలెత్తి ఆగిపోయింది. దీంతో మరమ్మతు బృందంతో కెనడా సాయుధ దళాలు రెండో విమానాన్ని పంపాల్సి వచ్చింది. గతేడాది గత ఏడాది సెప్టెంబరులో జరిగిన G20 సమ్మిట్ సందర్భంగా భారత్‌కు వచ్చిన ట్రూడో ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. ఆయన వచ్చిన రాయల్ కెనడా ఎయిర్‌ఫోర్స్ సీసీ-44 విమానం మొరాయించడంతో రెండు రోజుల పాటు భారత్‌లో ఉండిపోయారు.

ప్రధాని ట్రూడో గతేడాది డిసెంబర్‌ 26వ తేదీన కుటుంబంతో కలిసి వెకేషన్‌ కోసం జమైకా వెళ్లారు. వెకేషన్‌ను ముగించుకొని తిరుగు ప్రయాణానికి ముందు జనవరి 2వ తేదీన విమానంలో భద్రతా అధికారులు సాధారణ తనిఖీలు చేపట్టారు. అప్పుడు విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే కెనడాలోని ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కెనడా నుంచి వెంటనే మరో విమానంలో సాంకేతిక నిర్వహణ బృందాన్ని జమైకాకు పంపించారు. మరమ్మతుల అనంతరం జనవరి 4వ తేదీన ట్రూడో తన అధికారిక విమానంలోనే కెనడా చేరుకున్నారు. కాగా, ప్రధాని అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం నాలుగు నెలల్లోనే ఇది రెండోసారి కావడం గమనార్హం.

కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కూడా ట్రూడో విమానం ఇలాగే మొరాయించింది. ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు కోసం భార‌త్ వ‌చ్చిన ఆయన విమానంలో సాంకేతిక లోపం త‌లెత్తడంతో రెండు రోజుల పాటూ భార‌త్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. సదస్సు ముగిసిన తర్వాత ట్రూడో ఢిల్లీ నుంచి కెనడా బయలుదేరాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన సిబ్బంది చివరి నిమిషంలో ప్రయాణాన్ని రద్దు చేశారు. సుమారు 36 గంటల నిరీక్షణ తర్వాత తిరిగి కెనడా బయలుదేరి వెళ్లారు. ఇలా పలుమార్లు కెనడా అధికారిక విమానాలు ప్రధానిని ఇబ్బంది పెట్టాయి.

ముఖ్యంగా సెప్టెంబర్‌లో G20 సమ్మిట్ తర్వాత మెకానికల్ లోపం కారణంగా ఢిల్లీ నుంచి బయలుదేరడం ఆలస్యం అయింది. 2019లోనూ జర్నలిస్టులను తీసుకెళ్తున్న బస్సు, ట్రూడో లిబరల్ పార్టీ చార్టర్డ్ విమానం ఢీకొట్టింది. తర్వాత లండన్‌లో జరిగిన నాటో సదస్సుకు వెళ్లగా అక్కడ కూడా విమానానికి మారవలసి వచ్చింది. దురదృష్టవశాత్తూ బ్యాకప్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రూడో తన తిరుగు ప్రయాణం కోసం మూడోది ఎంచుకోవాల్సి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story