జస్ట్ టేస్టు చేస్తే చాలు.. గంటకు రూ.1700
'క్యాండీ ఫన్ హౌజ్' అనే కెనడా చాక్లెట్ కంపెనీ తమ ప్రొడక్ట్స్ టేస్టు చూసే ఉద్యోగం కోసం ఓ ప్రకటన విడుదల చేసింది.

X
Vamshi Krishna24 Jan 2021 10:00 AM GMT
తినడం కోసం డబ్బులు సంపాదించడం కామన్. కానీ తింటూ డబ్బులు సంపాదించడమే వెరైటీ. అవును.. ఇంతకీ అసలు ముచ్చటేంటంటే 'క్యాండీ ఫన్ హౌజ్' అనే కెనడా చాక్లెట్ కంపెనీ తమ ప్రొడక్ట్స్ టేస్టు చూసే ఉద్యోగం కోసం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగానికి సెలక్ట్ అయ్యిన ఉద్యోగులకు గంటకు 30 కెనడియన్ డాలర్లు అంటే దాదాపుగా రూ.1700 ఇస్తుందన్నమాట. సదరు కంపెనీ తాము తయారు చేసే పదార్ధాలను రుచి చూసే ఉద్యోగుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. భలేగుంది కదా ఉద్యోగం!. ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయాలనుకుంటే సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోండి. చివరి తేది ఫిబ్రవరి 15.
Next Story