ప్రపంచంలోనే అత్యంత పిసినారి.. డబ్బులు ఊరికే రావంటూ పిల్లి ఆహారాన్ని తిని..

ప్రపంచంలోనే అత్యంత పిసినారి.. డబ్బులు ఊరికే రావంటూ పిల్లి ఆహారాన్ని తిని..
'ప్రపంచంలోని పిసినారి మల్టీ-మిలియనీర్'. ఆమె ఆస్థి 5.3 మిలియన్ డాలర్లు (38 కోట్లు 78 లక్షల రూపాయలు)

డబ్బంటే ఎవరికి చేదు.. కష్టపడి సంపాదించి కూడబెడతారు... పోయేటప్పుడు కట్టుకుపోయేది ఏమీ లేదని తెలిసినా ఆ స్పృహతో అస్సలు ఉండరు. ఎంత సేపు సంపాదించాలనే యావ తప్పించి మరో ఆలోచన ఉండదు. తాము తినరు మరొకరికి పెట్టరు మరి కొంత మంది. ఆస్తులు కూడబెట్టే ధ్యాసే.. పిసినారి తనం ఉండొచ్చు కానీ మరీ పిల్లికి పెట్టే ఫుడ్డు కూడా తినేంత పిసినారులను ఎక్కడా చూసి ఉండం..

అమెరికాలోని లాస్ వెగాస్‌లో నివసించే 50 ఏళ్ల అమీ ఎలిజబెత్ అనే మహిళ 'ప్రపంచంలోని పిసినారి మల్టీ-మిలియనీర్'. ఆమె ఆస్థి 5.3 మిలియన్ డాలర్లు (38 కోట్లు 78 లక్షల రూపాయలు) అయినా అవసరం లేని చోట డబ్బు ఖర్చు చేయడానికి నిరాకరిస్తుంది. కిరాణా బిల్లును తగ్గించుకునేందుకు పిల్లి ఆహారాన్ని కూడా తింటుంది.

సరిగ్గా స్నానం చేయడానికి సరిపోయినంత వేడినీటి కోసం గీజర్‌ని 22 నిమిషాలకు సెట్ చేసుకుంటుంది. అంతకంటే ఒక్క నిమిషం ఎక్కువైనా భరించలేదు.

గిన్నెలు తోమే స్క్రబ్బర్‌ కూడా చిల్లులు పడే వరకు ఉంచుతుంది. అంత త్వరగా కొత్తది మార్చను. ఇక ఇంట్లో కూరగాయలు కట్ చేయడానికి ఒక చాకును మాత్రమే ఉపయోగిస్తుంది. చాకుతో పనైపోయాక శుభ్రంగా తుడిచి పెట్టేస్తుంది. అంతే కానీ నీళ్లు పోసి కడగను. దీని ద్వారా నీరు కూడా ఆదా అవుతుందని అంటుంది.

భర్తతో విడాకులు తీసుకున్న ఆమెకు అతడి నుంచి ఓ పెద్ద బంగ్లా వచ్చింది. అయితే అతడే వచ్చి బంగ్లాను ఉచితంగా రోజూ క్లీన్ చేయడాలని విడాకుల సమయంలో ఒప్పందం కుదుర్చుకుంది.

మాజీ భర్త మైఖేల్ ముర్రే వచ్చి రోజూ క్లీన్ చేసి వెళ్తాడు. ఇలా ఆమె ఇల్లు క్లీనింగ్ నిమిత్తం 400 డాలర్లు ఆదా చేస్తుంది.

అమీ ఆఫీసుకి వెళ్లాలంటే ఫ్లైట్‌లో ప్రయాణించవలసి ఉంటుంది. కానీ డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయని తన 17 ఏళ్ల నాటి కారులో తానే డ్రైవ్ చేసుకుంటూ నాలుగు గంటలు ప్రయాణించి ఆఫీసుకు చేరుకుంటుంది. ఇది చూసి చాలా మంది నవ్వుతున్నా తానేమీ పట్టించుకోనంటుంది. నా లక్ష్యం ఖర్చును తగ్గించుకోవడం, సంపదను పెంచుకోవడం అని అమీ చెబుతుంది.

Tags

Read MoreRead Less
Next Story