అంతర్జాతీయం

China: పిల్లలు తప్పుచేస్తే తల్లిదండ్రులకు జైలు శిక్ష..

China: ఈ జెనరేషన్‌లో చిన్నప్పటి నుండే పిల్లలపై ఒత్తిడి పడుతోంది. క్షణం తీరిక లేకుండా చదువులు..

China (tv5news.in)
X

China (tv5news.in)

China: ఈ జెనరేషన్‌లో చిన్నప్పటి నుండే పిల్లలపై ఒత్తిడి పడుతోంది. క్షణం తీరిక లేకుండా చదువులు.. ఆఫ్‌లైన్ కాకపోతే ఆన్‌లైన్ క్లాసులు.. ఇలా ఒకటి కాకపోతే ఇంకొకటి వారిని మరింత ఒత్తడికి గురిచేస్తున్నాయి. చిన్నప్పటి నుండే ర్యాంకుల రేసు వారికి మరో ధ్యాస లేకుండా చేస్తోంది. అందుకే పిల్లలపై చదువుల భారం తగ్గించేందుకు చైనా కొత్త చట్టం ప్రేవేశపెట్టనుంది.

ప్రస్తుతం చైనా.. పిల్లలపై ఒత్తడి తగ్గే కొత్త చట్టం ప్రవేశపెటట్టడం వైపు అడుగులేస్తోంది. పైగా ఒత్తిడి తగ్గాలంటే చదువు భారం మాత్రమే తగ్గితే సరిపోదు.. దానికి తగిన విశ్రాంతి కూడా కావాలి. అందుకే పిల్లలు సరిగ్గా నిద్రపోతున్నారా లేదా అన్న విషయాన్ని తల్లిదండ్రులు గమనించాలని సూచిస్తోంది.

అధికంగా ఇంటర్నెట్ వాడకం కూడా మానసిక ఒత్తిడికే దారితీస్తుంది. అందుకే పిల్లలు స్మార్ట్ ఫోన్‌లకు, వీడియో గేమ్‌లకు దూరంగా ఉండేలా చూసుకోమని తల్లిదండ్రులకు సూచిస్తోంది చైనా ప్రభుత్వం. తాము తీసుకురానున్న కొత్త చట్టంలోని నిబంధనలను అమలు చేసే బాధ్యత స్థానిక అధికార యంత్రాంగానికి అప్పగించాలనుకుంటోందట.

చైనాలోని పిల్లలు వీడియో గేమ్స్ ఆడే విషయంలో కూడా చైనా షరతులు పెట్టింది. 18 ఏళ్ల వయస్సులోపు వారు ఇకపై వారంలో మూడు గంటలు మాత్రమే ఆడుకొనేలా కొత్త రూల్ పెట్టింది. ఇక వీకెండ్స్, హాలిడేస్ వస్తే మాత్రం 8 నుండి 9 గంటలు వీడియో గేమ్స్ ఆడుకునే సౌలభ్యం కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గేమింగ్ ఇండస్ట్రీపై పెద్ద దెబ్బే పడింది.

'ఫ్యామిలీ ఎడ్యుకేషన్‌ ప్రమోషన్‌ లా' పేరుతో ఒక కొత్త బిల్లును ప్రవేశపెట్టంది చైనా. అంటే ముందుగా పిల్లల ప్రవర్తన బాలేకపోయినా, వారేదైనా నేరాలకు పాల్పడిన ముందుకు తల్లిదండ్రులకు సమాచారం అందుతుంది. అప్పటినుండి వారి పిల్లల్లో మార్పు తీసుకురావడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలి. ఒకవేళ వారు మారకపోతే పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సిందే. శిక్ష ఏంటంటే.. వారికి 156 డాలర్ల (సుమారు రూ.11,600) లేదా 5 రోజుల జైలు శిక్ష విధించే అవకాశముంటుంది.

ఇలాంటి వాటి వల్ల పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం వారి స్వేచ్ఛను కోల్పోతారని వాదిస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం వల్ల పిల్లలు పక్కదారి పడతారని ప్రభుత్వం తమ చట్టాలను కఠినంగా అమలుచేసే పనిలో పడింది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES